Banks Privatisation: భారత్‌లో బ్యాంకు ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కరోనా సమయంలోనూ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో రైల్వే శాఖ ఒకటికాగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిజ్ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించే ప్రభుత్వ రంగ బ్యాంకుల పేర్లను నీతి ఆయోగ్ ఖరారు చేసింది. ఈ బ్యాంకుల జాబితాను డిజిన్వెస్ట్‌మెంట్‌పై కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సీజీఎస్‌డీ గ్రూప్‌కు సమర్పించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. క్యాబినెట్ కార్యదర్శి సారథ్యంలోని సీజీఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ జాబితాను.. ఆల్టర్‌నేటివ్ మెకానిజమ్ (ఏఎమ్)కు పంపిస్తారు. అనంతరం తుది ఆమోదం కోసం ప్రధాని సారథ్యంలోని క్యాబినెట్‌కు పంపుతారు. క్యాబినెట్ ఆమోదం లభించిన వెంటనే.. ప్రైవేటీకరణకు వెసులుబాటు కల్పించేలా నియంత్రణపరమైన నిబంధనల్లో సవరణలు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించాలని 2021–22 కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. వాటిని ఎంపిక చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కి అప్పగించిన విషయం విధితమే.
Steel Rate: భారీగా పెరిగిన ఉక్కు ధరలు..నిర్మాణ రంగంపై పెను భారం..మరింత పెరిగే అవకాశం!