ముఖేష్ అంబానీకి ఇష్టమైన స్నాక్ ఐటమ్‌ ఇది..! కావాలంటే మీరు కూడా ట్రై చెయొచ్చు..

|

Aug 03, 2024 | 7:48 PM

ఈ పంకీ స్నాక్‌ గ్లూటెన్ రహితమైనదిగా చెప్పారు. పాంకీని తినడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బియ్యం పిండితో తయారు చేస్తారు. బియ్యం పిండి గ్లూటెన్ రహితం. ఇందులో పీచు తక్కువగా ఉన్నప్పటికీ దీని తయారీకి వాడే పదార్థాలు పీచు పరిమాణం కూడా పెరిగి జీర్ణం కావడం సులభం అవుతుంది. ఇది తక్కువ కొవ్వు, తక్కువ క్యాలరీలు, గ్లూటెన్ లేని కారణంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ముఖేష్ అంబానీకి ఇష్టమైన స్నాక్ ఐటమ్‌ ఇది..! కావాలంటే మీరు కూడా ట్రై చెయొచ్చు..
Mukesh Ambani Favourite Food
Follow us on

Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఒకరు. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లు యాంటిలియోలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు. ఆసియాలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరైనప్పటికీ, అతని జీవనశైలి, దేశీ ఆహారపు అలవాట్లు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. అంబానీ గుజరాత్ నివాసి. అతనికి గుజరాతీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కొంతకాలం క్రితం, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వారణాసిని సందర్శించారు. అక్కడ ఆమె వారణాసిలోని ప్రసిద్ధ చాట్‌ను ఆస్వాదించారు. ఇది మాత్రమే కాదు ఆమె అక్కడి స్థానిక ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. తన భర్త ముఖేష్ అంబానీ, ఇతర కుటుంబ సభ్యులకు ఇష్టమైన స్నాక్స్‌ విషయం వారితో ముచ్చటించారు.

తన భర్త ముఖేష్ అంబానీ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు నితా అంబానీ. ముఖేష్ ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తింటాడు. వారానికి ఒకసారి మాత్రమే బయట తింటాడు. బియ్యపు పిండితో చేసిన గుజరాతీ స్నాక్ పంకీ అంటే ముఖేష్ అంబానీకి ఇష్టమని నీతా చెప్పింది. అంబానీకి అత్యంత ఇష్టమైన గుజరాతీ స్నాక్‌.. పంకీ బియ్యప్పిండితో చేస్తారు. దీని తయారీలో అరటి ఆకులను కూడా వినియోగిస్తారు. అరటి ఆకులతో వండిన వంటలకు సహజమైన రుచి వస్తుందని, అలాగే పోషకాలతో నిండి ఉంటుంది.

అరటి ఆకులలో సహజమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాని చంపడానికి సహాయపడతాయి. అందుకే అరటి ఆకుల్లో వండిన పంకీ అనే స్నాక్ ను ఇష్టంగా తింటారు. అంబానీ కుటుంబం వారు తినే స్నాక్స్ లో ఎక్కువగా బియ్యప్పిండితో చేసిన ఆహారాలే ఉంటాయి. నెయ్యితో వండిన వంటకాలు అధికంగానే ఉంటాయి. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకుంటారు.అంతేకాదు, ఈ పంకీ స్నాక్‌ గ్లూటెన్ రహితమైనదిగా చెప్పారు. పాంకీని తినడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బియ్యం పిండితో తయారు చేస్తారు. బియ్యం పిండి గ్లూటెన్ రహితం. ఇందులో పీచు తక్కువగా ఉన్నప్పటికీ దీని తయారీకి వాడే పదార్థాలు పీచు పరిమాణం కూడా పెరిగి జీర్ణం కావడం సులభం అవుతుంది. ఇది తక్కువ కొవ్వు, తక్కువ క్యాలరీలు, గ్లూటెన్ లేని కారణంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..