Adani Group: వారాంతంలో హుషారుగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. లాభపడ్డ ఆదానీ షేర్లు

|

May 19, 2023 | 6:45 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో జోరుగా ముగిశాయి. ప్రారంభంలో ఫ్లాట్‌ ట్రేడింగ్‌ కొనసాగించినట్లు తర్వాత మార్కెట్లో మరింతగా పుంజుకున్నాయి. అయితే ముఖ్యంగా హిండెన్‌బర్గ్‌ ఆదానీ గ్రూప్‌ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో ఆదానీ గ్రూప్‌ కంపెనీల..

Adani Group: వారాంతంలో హుషారుగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. లాభపడ్డ ఆదానీ షేర్లు
Adani Group
Follow us on

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో జోరుగా ముగిశాయి. ప్రారంభంలో ఫ్లాట్‌ ట్రేడింగ్‌ కొనసాగించినట్లు తర్వాత మార్కెట్లో మరింతగా పుంజుకున్నాయి. అయితే ముఖ్యంగా హిండెన్‌బర్గ్‌ ఆదానీ గ్రూప్‌ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో ఆదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. దీనికి తోడు ఐటీ షేర్లలో ర్యాలీ దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. అయితే ఫార్మా రంగంలో షేర్లు భారీగానే నష్టపోయాయి. సెన్సెక్స్ 298 పాయింట్ల లాభంతో 61730 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 18203 వద్ద ముగిసాయి.

ఆదానీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ఆరుగురు సభ్యుల బృందం ప్రస్తుత దశలో ఆదానీ గ్రూప్‌ షేర్ల ధరలను తామరుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు సాధ్యం కాదని తెలిపింది. అలాగే 13 ఎఫ్‌పిఐల వెనుక ఉన్న లబ్ధిదారులకు గ్రూప్‌తో లింక్ ఉందో లేదో నిర్ధారించేందుకు ఇంకా ఇంకా టైమ్‌ కావాలని సెబీ కోరింది.

టాప్‌ గెయినర్లుగా ఈ కంపెనీ షేర్లు:

ఆదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఎయిర్టెల్‌, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి