Maruti Suzuki Jimny: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతీ నుంచి నయా ఎస్‌యూవీ.. ధరెంతో తెలుసా?

|

May 24, 2023 | 6:30 PM

భారతదేశంలో అధిక సంఖ్య కార్ల విక్రయాలు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు పోటాపోటీగా కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల ఎస్‌యూవీ రంగంలో తనదైన మార్క్ చూపించిన మహీంద్రా థార్‌కు పోటీగా మారుతీ సుజుకీ మరో కొత్త ఎస్‌యూవీను లాంచ్ చేస్తుంది.

Maruti Suzuki Jimny: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతీ నుంచి నయా ఎస్‌యూవీ.. ధరెంతో తెలుసా?
Jimny
Follow us on

ప్రస్తుత రోజుల్లో కార్ అనేది ఓ స్టేటస్ సింబల్‌లా మారిపోయింది. గతంలో కార్లు కేవలం ధనిక వర్గాల వారి వద్ద మాత్రమే ఉండేవి. కానీ భారతదేశంలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ కంపెనీలు కూడా తక్కువ ధరల్లో కార్లను రిలీజ్ చేయడంతో చాలా మంది ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్లడానికి ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. భారతదేశంలో అధిక సంఖ్య కార్ల విక్రయాలు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు పోటాపోటీగా కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల ఎస్‌యూవీ రంగంలో తనదైన మార్క్ చూపించిన మహీంద్రా థార్‌కు పోటీగా మారుతీ సుజుకీ మరో కొత్త ఎస్‌యూవీను లాంచ్ చేస్తుంది.మారుతి సుజుకి జిమ్నీ పేరుతో లాంచ్ చేయబోతున్న ఈ ఎస్‌యూవీను జూన్ 7న లాంచ్ చేస్తారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మామూలుగా అయితే ఈ ఎస్‌యూవీ ఈ నెలలోనే భారతదేశంలో లాంచ్ అవుతుందని భావించారు. మారుతి సుజుకి జిమ్నీ గురించి 2023 ప్రారంభం నుంచి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ఈ కార్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం మారుతి సుజుకి జిమ్నీని కంపెనీకు చెందిన గుర్గావ్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో జిమ్నీ కోసం 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది . జూన్ మొదటి వారంలో ఈ ఎస్‌యూవీల డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కార్ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసకుందాం.

కొత్త జిమ్నీ 103 హార్స్‌పవర్‌తో 134 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. వినియోగదారులు లీటర్‌కు 16.94 కిలోమీటర్ల మైలేజ్‌ను పొందుతారు.ఈ కార్‌లో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 16.39 కిలోమీటర్ల మైలేజీతో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మధ్య ఎంచుకునే అవకాశం ఉంది. భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఈ కార్ వినియోగదారులకు మరిన్ని ఫీచర్లను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకి జిమ్నీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. జీటా, ఆల్ఫా వెర్షన్లలో ఈ కార్ అందుబాటులో ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇప్పటి వరకు, జిమ్నీ 3-డోర్ వెర్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కాబట్టి ఇప్పడు కొత్తగా 5 డోర్ వెర్షన్‌తో రిలీజ్ చేస్తున్న ఈ భారతీయ వేరియంట్‌ను ఎస్‌యూవీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..