AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business: కొత్తేడాది కొత్త రూల్స్‌.. డిసెంబర్‌ 31లోపే ఈ పనులు పూర్తి చేసుకోండి.

023 ఏడాదికి గుడ్‌బై చెప్పేందుకు ఇంకా కేవలం వారం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏడాది ముగుస్తున్న సందర్భంగా ఆర్థికపరమైన కొన్ని నిబంధనలు మారనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ కొత్తేడాదిలో ఎలాంటి నిబంధనలు మారనున్నాయి.? ఏడాది చివరి నాటికి పూర్తి చేయాల్సి పనులు ఏంటి.?

Business: కొత్తేడాది కొత్త రూల్స్‌.. డిసెంబర్‌ 31లోపే ఈ పనులు పూర్తి చేసుకోండి.
Financial Rules
Narender Vaitla
|

Updated on: Dec 24, 2023 | 12:48 PM

Share

కొత్తేడాదికి వెల్‌ కమ్‌ చెప్పేందుకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. 2023 ఏడాదికి గుడ్‌బై చెప్పేందుకు ఇంకా కేవలం వారం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏడాది ముగుస్తున్న సందర్భంగా ఆర్థికపరమైన కొన్ని నిబంధనలు మారనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ కొత్తేడాదిలో ఎలాంటి నిబంధనలు మారనున్నాయి.? ఏడాది చివరి నాటికి పూర్తి చేయాల్సి పనులు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* మీరు ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లైతే డిసెంబర్‌ 31వ తేదీలోపు నామినీని యాడ్‌ చేసుకోవాలి. డీమ్యాట్‌లో ఖాతాలో నామినేషన్‌ చేయడానికి సెబీ డిసెంబర్‌ 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. గడువులోపు నామినీ పేరును యాడ్ చేయకపోతే డీమ్యాట్ అకౌంట్‌ క్లోజ్‌ అవుతుండొచ్చు. డిపాజిట్, విత్‌డ్రా చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

* ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి తొలుత జులై 31, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. అయితే చాలా మంది పన్ను చెల్లింపు దారులు రిటర్న్స్ దాఖలు చేయలేక పోయారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారికోస ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 31 వరకు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. లేదంటే జనవరి 1వ తేదీ నుంచి జరిమానా పెరుగుతుంది.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ కస్టమర్ల లాకర్‌ అగ్రిమెంట్‌ను సవరించాలని బ్యాంకులను కోరింది. ఇందుకు డిసెంబర్‌ 31వ తేదీని చివరి రోజుగా నిర్ణయించింది. గడువు లోపు అగ్రిమెంట్‌ను సవరించుకోకపోతే.. బ్యాంక్‌ లాకర్‌ను క్లోజ్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మీకు ఒకవేళ లాకర్‌ ఉన్నట్లైతే కొత్త లాకర్‌ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకోండి.

* ఇక చాలా కాలం పాటు ఉపయోగంలో లేని యూపీఐ ఐడీలను డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత క్లోజ్‌ చేయాలని నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. పేటీఎమ్‌, గూగుల్‌పే, ఫోన్‌ పేవంటి యూపీఐ పేమెంట్స్‌లో చాలా కాలంగా లావాదేవీలు లేకపోతే అలాంటి ఐడీలను మూసి వేయనున్నారు. ఒకవేళ మీకు ఐడీ ఉంటే మాత్రం వెంటనే ఏదైనా ట్రాన్సాక్షన్‌ను చేయండి.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాకు చెందిన అమృత్‌ కలాష్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ పథకాన్ని డిసెంబర్ 31వ తేదీతో మూసి వేయనుంది. ఇది 400 రోజులు ఎఫ్‌డీ స్కీమ్‌, ఇందులో పెట్టుబడి పెడితే 7.60 శాతం వడ్డీ వస్తుంది. ఇందులో ప్రీమెచ్యూర్‌, లోన్‌ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..