జూన్ నెల ముగియనుంది. కొత్త నెల జూలై ప్రారంభం కానుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిసారీ మాదిరిగానే, ఈసారి కూడా చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. వంటగ్యాస్, కమర్షియల్ గ్యాస్, సీఎన్‌జీ-పీఎన్‌జీ సహా పలు వస్తువుల ధరలు, నిబంధనలలో మార్పు కానున్నాయి. జూలై నెలలో జరిగే ఈ మార్పులు సామాన్యుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. మీరు వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం ముఖ్యం. జూలై 1 ఎలాంటి మార్పులు జరుగనున్నాయో తెలుసుకోండి.
LPG గ్యాస్ ధరను దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా నిర్ణయిస్తాయి. ఒకటో తేదీన ధర పెరగొచ్చు.. తగ్గొచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో జూలైలో ఎల్పీజీ గ్యాస్ రేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. మే, ఏప్రిల్ నెలల్లో 19 కిలోల వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించగా, 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారణంగానే ఈసారి ఎల్పీజీ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.
విదేశాల్లో క్రెడిట్ ద్వారా ఖర్చు చేయడంపై టీసీఎస్‌ని వర్తింపజేయడానికి ఒక నిబంధన ఉంది. ఇది 1 జూలై 2023 నుంచి వర్తిస్తుంది. దీని కింద 7 లక్షల కంటే ఎక్కువ ఖర్చుపై 20% వరకు టీసీఎస్ ఛార్జీ విధించబడుతుంది. అయితే విద్య, వైద్యానికి ఈ ఛార్జీ 5%కి తగ్గించబడుతుంది. అయితే మీరు విదేశాల్లో విద్యా రుణం తీసుకుంటున్నట్లయితే ఈ ఛార్జీ మరింత 0.5 శాతానికి తగ్గించబడుతుంది.
ప్రతి నెలలాగే ఈ నెల కూడా సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలలో మార్పు ఉండవచ్చు. ఢిల్లీ, ముంబైలలోని పెట్రోలియం కంపెనీలు మొదటి తేదీన గ్యాస్ ధరను మారుస్తాయి.
ప్రతి పన్ను చెల్లింపుదారు ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ జూలైతో ముగియనుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, జూలై 31 లోపు ఫైల్ చేయండి.