లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ట్రెర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టెక్-టర్మ్ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, స్వచ్ఛమైన రిస్క్ ప్రీమియం ఉన్న జీవిత బీమా ప్లాన్. అయితే ఈ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ కాంపోనెంట్ లేదా ఇన్సూరర్ లాభాలు లేదా బోనస్‌లలో భాగస్వామ్యాన్ని అందించదు. నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే పాలసీదారు ప్రీమియంలు ఏ ఫండ్‌లో పెట్టుబడి పెట్టరు. అలాగే రాబడులు లేదా ప్రయోజనాలు ఎలాంటి పెట్టుబడి పనితీరుతో లింక్ చేయరు. ఈ రకమైన బీమాను టర్మ్ ఇన్సూరెన్స్ లేదా ప్యూర్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. నాన్-పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ అంటే పాలసీదారుకు బీమాదారు లాభాలు లేదా బోనస్‌లలో పాల్గొనే అర్హత లేదు. పాలసీదారు చెల్లించే ప్రీమియంలు పెట్టుబడి ప్రయోజనాల కోసం కోసం కాకుండా బీమా కవరేజీని అందించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కాదు. ఈ ప్లాన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో బీమా చేసిన వ్యక్తి కుటుంబానికి ఈ ప్లాన్ ఆర్థిక రక్షణను అందిస్తుంది. అయితే పాలసీదారు పాలసీ వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి సొమ్ము చేతికిరాదనే విషయాన్ని గమనించాలి.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు వారి మరణానంతరం వారిపై ఆధారపడిన వ్యక్తులు(భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) కోసం కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాన్స్‌లో ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. అయితే పాలసీ వ్యవధిలోనే పాలసీదారు మరణిస్తేనే బీమా అందుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు దరఖాస్తుదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో కనీస పాలసీ వ్యవధి పది సంవత్సరాలుగా ఉంటే, గరిష్టంగా 40 సంవత్సరాలుగా ఉంది.
మొదటి సంవత్సరంలో ఆత్మహత్యలు మినహా ప్రమాద మరణాలతో సహా అన్ని రకాల మరణాలు ఈ పథకం కింద కవర్ అవుతాయి. అలాగే పాలసీ జారీ చేశాక తర్వాత మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మరణించినా బీమా సొమ్ము అందుతుంది. అంటే ఒకవేళ మీకు విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చినా కూడా కవరేజీ వర్తిస్తుంది. పాలసీ టర్మ్ సమయంలో పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే బీమా హామీ మొత్తం చెల్లిస్తారు. అయితే ఈ పాలసీకి మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇతర వివరాలకు ఎల్ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి