ఇన్‌కం టాక్స్ ఫైల్ చేయకపోతే డబుల్ టీడీఎస్… ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్..!

|

Feb 08, 2021 | 10:06 AM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపన్ను చెల్లింపులకు సంబంధించి కొత్త విధానం ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇన్‌కం టాక్స్  ఫైల్ చేయకపోతే డబుల్ టీడీఎస్... ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్..!
Follow us on

Income Tax new rules: ఈ ఏడాద కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపన్నుదారులకు ఊరటనిస్తూనే కొన్ని మార్పులు తీసుకువచ్చింది కేంద్రం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపన్ను చెల్లింపులకు సంబంధించి కొత్త విధానం ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడోవసారి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కల్లోలం తర్వాత బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో అందరి కళ్లు కేంద్ర బడ్జెట్‌పై పడింది. ముఖ్యమంగా ఆదాయపు పన్ను మినహాయింపు పెంచుతారని అంతా ఆశించారు. కొన్ని వెసులుబాట్లు ఇస్తారని భావించారు. కాగా, ఆర్థిక మంత్రి మాత్రం ఇన్‌కంటాక్స్ స్లాబుల జోలికి వెళ్లలేదు. దీంతో సామాన్యులు ఉపిరి పీల్చుకున్నారు.

అయితే, ఆదాయపన్ను చెల్లింపుల్లో ఈసారి వ‌ృద్ధులకు మాత్ర ఊరటినిచ్చార ఆర్థిక మంత్రి. 65 ఏళ్లు దాటిన పెన్షనర్లు మాత్రం ఇన్‌కంటాక్స్ రిటర్నులు ఫైల్ చెయ్యాల్సిన అవసరం లేదని తెలిపారు. దీంతో సీనియర్ సిటిజన్లకు ఈ బడ్జెట్ తీపి కబురు చెప్పినట్లైంది. ఈ కొత్త మార్పు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానుంది.

మరోవైపు ఆదాయపన్ను చెల్లింపుదారులకు మాత్రం ఓ ట్విస్ట్ ఇచ్చారు ఆర్థిక మంత్రి. ఎలాగూ నిల్ వస్తుంది కదా అని ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారికి మాత్రం షాక్ ఇచ్చారు. ఇది సరైన విధానం కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఫైలింగ్‌ని పెంచేందుకు కొత్త రూల్స్ తెస్తోంది. అటు టీడీఎస్ రూల్స్‌లో మార్పులు చేసింది. ఇందుకోసం కేంద్రం… ఆదాయపు పన్ను చట్టానికి 206AB అనే సెక్షన్‌ని జోడించింది. ఈ కొత్త రూల్ ప్రకారం…ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉన్నా… చెయ్యకపోతే… మీరు రెట్టింపు టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూల్ కూడా ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. దీంతో రిటర్న్స్ ఫైల్ చేయని వారి నుంచి ఇకపై కేంద్రానికి ఎక్కువ టాక్స్ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

మరోవైపు, కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త వేతన విధానం అమల్లోకి వస్తే… రిటైర్మెంట్ సేవంగ్స్ తగ్గిపోతాయి. ప్రావిడెంట్ ఫండ్ ఏడాదికి రూ.2.5 లక్షలు దాటితే… అది కూడా టాక్స్ పరిధిలోకి వచ్చేస్తుంది. దానిపై పన్ను లెక్కిస్తారు. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది.

ఇక, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా… ఏప్రిల్ 1, 2021 నుంచి ముందుగానే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ ముందస్తుగా ITR ఫైల్ చేసే అంశాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఫారంలను కేంద్రం అందుబాటులోకి తెస్తుంది. తద్వారా ఉద్యోగులు తమ వీలును బట్టి రిటర్న్ ఫైల్ చేయవచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది.

తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం… లైవ్ ట్రావెల్ కన్సెషన్ కేస్ వోచర్ స్కీమ్ (LTC స్కీమ్) నోటిఫై చేసింది. కరోనా వైరస్ కారణంగా… LTC టాక్స్ గడువు పొందలేకపోయినవారి కోసం కేంద్రం ఈ స్కీమ్ తెచ్చింది. ఇది కూడా ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానుంది.

Read Also… ముస్లింగా పుట్టి తత్వవేత్తగా మారిన శ్రీ ఎం.. భారత ప్రభుత్వం చేత మన్ననలను పొందుతున్న యోగా గురువు.. ఇంతకీ ఎవరతను..?