దేశంలోని సగం మంది యువత రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలనుకుంటున్నారు. సీబీఆర్‌ఈ సర్వేలో, 18-41 సంవత్సరాల వయస్సు గల 45% మంది యువత నగరంలో కొత్త ఇంటికి మారడం తమ మొదటి ఆప్షన్ అని 26-41 ఏళ్ల వయసున్న వారు చెబుతున్నారు. అది నగరమైనా కానీయండి.. పల్లె అయినా కానీయండి.. అద్దె ఇంటిలో ఉండడం అంటే చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే నెల వచ్చేసరికి కచ్చితంగా తిన్నా.. తినకపోయినా అద్దె కట్టాల్సిందే. నెల జీతంపై ఆధారపడేవారు వారి జీతం నుంచి ముందు అద్దె కట్టిన తరువాతనే తమ నిత్యావసర వస్తువుల గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అందుకే మనం తరచూ ఎక్కువ మంది నోటి నుంచి సొంతిల్లు ఉంటే బావుండును అనే కోరిక వినిపిస్తుంది. ఎంతలా అంటే.. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో గా భారతీయుల్లో 70% మంది అద్దె ఇంట్లో ఉండడం కంటే సొంత టిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారని చెప్పారు. ఇది మునుపటి సర్వేలో ఉన్న ట్రెండ్‌కు విరుద్ధంగా ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ దక్షిణాసియా మొత్తం ఈ సర్వే నిర్వహించింది. ఇందులో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 20,000 మందికి పైగా పాల్గొన్నారు.
భారతదేశం నాణ్యమైన జీవితానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న 52% మంది భారతీయులు మెరుగైన నాణ్యమైన ఆస్తి, పర్యావరణంలో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 72% మంది వచ్చే రెండేళ్లలో వేరే ప్రాంతాలకు మారాలని యోచిస్తున్నారు. కానీ వారు అద్దె ఇంట్లో నివసించే బదులు సొంత ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అలాగే మన దేశంలో 69% మంది వారానికి మూడు రోజులు మాత్రమే ఆఫీసు నుండి పని చేయాలనుకుంటున్నారు.
ఈ సర్వే తేల్చిన ఫలితాలతో రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సర్వేలో చాలా మంది యువత ఇళ్లు కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజలు ఇల్లు కొనుగోలు చేసే ముందు ఆస్తి నాణ్యత అలాగే చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో డెవలపర్‌లు రిమోట్ వర్కింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ఇంటీరియర్ డిజైన్, మెరుగైన అవుట్‌డోర్ వంటి వాటిపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి