Pulsar p150: కొత్త పల్సర్‌ బండి వచ్చేసింది.. 150 సీసీలో స్పోర్ట్స్‌ బైక్‌, ధర ఎంతంటే..

|

Nov 23, 2022 | 2:46 PM

భారత్‌లో బజాజ్‌ పల్సర్‌కి యూత్‌లో ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బజాజ్‌లో అత్యధికంగా అమ్ముడు పోయిన బైక్‌గా పల్సర్‌కి పేరు ఉంది. తాజాగా బజాజ్‌ కంపెనీ దేశీయ మార్కెట్లోకి కొత్త పల్సర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. రేసింగ్ రెడ్‌, ఎబోనీ బ్లాక్‌ బ్లూ, ఎబోనీ బ్లాక్‌ వైట్‌, ఎబోనీ బ్లాక్‌..

Pulsar p150: కొత్త పల్సర్‌ బండి వచ్చేసింది.. 150 సీసీలో స్పోర్ట్స్‌ బైక్‌, ధర ఎంతంటే..
Pulsar P150
Follow us on

భారత్‌లో బజాజ్‌ పల్సర్‌కి యూత్‌లో ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బజాజ్‌లో అత్యధికంగా అమ్ముడు పోయిన బైక్‌గా పల్సర్‌కి పేరు ఉంది. తాజాగా బజాజ్‌ కంపెనీ దేశీయ మార్కెట్లోకి కొత్త పల్సర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. రేసింగ్ రెడ్‌, ఎబోనీ బ్లాక్‌ బ్లూ, ఎబోనీ బ్లాక్‌ వైట్‌, ఎబోనీ బ్లాక్‌ రెడ్‌, కరేబియన్‌ బ్లూ ఇలా మొత్తం 5 రంగుల్లో ఈ బైక్‌ను తీసుకొచ్చారు.

డ్యూయల్‌ డిస్క్‌లు అందించిన ఈ బైక్‌లో వెనకాల సీట్ కాస్త హైట్‌ ఇచ్చి స్పోర్ట్స్‌ లుక్‌లో డిజైన్‌ చేశారు. ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌తో పాటు యూసీబీ ఛార్జింగ్ పోర్ట్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 150 సీసీ సెగ్మెంట్‌లో మరింత మార్కెట్‌ను హస్తగతం చేసుకునేందుకునే బజాజ్‌ ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ఇక ఈ బైక్‌లో 149 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌ను ఇచ్చారు. ఈ ఇంజన్‌ 8500 ఆర్‌పీఎమ్‌ వదర్ద 14.5 హెచ్‌పీని విడుదల చేస్తుంది. 14 లీటర్ల పెట్రోల్‌ కెపాసిటీ ఈ బైక్‌ సొంతం.

గ్రౌండ్ క్లియరెన్స్‌ 165 ఎమ్‌ఎమ్‌గా ఉంది. సింగల్‌, డ్యూయల్‌ డిస్క్‌ వేరియంట్స్‌లో ఈ బైక్‌ను లాంచ్‌ చేశారు. ఇక ఈ బైక్‌ ధర విషయానికొస్తే.. సింగిల్‌-డిస్క్‌, సింగిల్‌ సీట్‌ కలిగిన బైక్‌ ధర రూ.1.16 లక్షలు కాగా, ట్విన్‌-డిస్క్‌, స్లిట్‌ సీట్‌ మోడల్‌ ధర రూ.1,19,757గా నిర్ణయించారు. 150 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైకులో యూఎస్‌బీ మొబైల్‌ చార్జింగ్‌ పోర్ట్‌, గేర్‌ ఇండికేటర్‌, సింగిల్‌ చానల్‌ ఏబీఎస్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీ వంటి ఫీచర్స్‌ను ప్రత్యేకంగా అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..