P-Sport Electric Bike: మేడ్ ఇన్ ఆంధ్రా ఎలక్ట్రిక్ బైక్ ఇది.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 210 కి.మీ.. ధర ఎంతంటే..

పవర్ ఈవీ అనే సంస్థ  ఫ్యూచరిస్టిక్ ఆటోమొబైల్ కంపెనీ. ప్రస్తుతం దీని కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీకి వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ రెడ్డి. వీరి కుటుంబం 15 సంవత్సరాలకు పైగా ఆటోమొబైల్ పరిశ్రమలో అనుభవం ఉంది. సంప్రదాయ ఐఈసీ మోటార్‌సైకిళ్ల కంటే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను నడపడం మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించాలని తమ ఇంజనీర్ల బృందం కోరుకుంటుందని ఆయన ఓ సందర్భంలో పేర్కొన్నారు.

P-Sport Electric Bike: మేడ్ ఇన్ ఆంధ్రా ఎలక్ట్రిక్ బైక్ ఇది.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 210 కి.మీ.. ధర ఎంతంటే..
Power Ev P Sport
Follow us

|

Updated on: May 01, 2024 | 7:57 AM

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా స్కూటర్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్‌లు మాత్రం కాస్త తక్కువగానే మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిల్లో ఇటీవల వచ్చిన మేడ్ ఇన్ ఆంధ్రా ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ పవర్ ఈవీ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. పీ-స్పోర్ట్ పేరుతో వచ్చిన ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 150 కిలోమీటర్ల రేంజ్, 210 కిలోమీటర్ల రేంజ్ లతో వస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది మన దేశ రోడ్లకు సరిగ్గా సరిపోతుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మేడ్ ఇన్ ఆంధ్రా బైక్..

పవర్ ఈవీ అనే సంస్థ  ఫ్యూచరిస్టిక్ ఆటోమొబైల్ కంపెనీ. ప్రస్తుతం దీని కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీకి వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ రెడ్డి. వీరి కుటుంబం 15 సంవత్సరాలకు పైగా ఆటోమొబైల్ పరిశ్రమలో అనుభవం ఉంది. సంప్రదాయ ఐఈసీ మోటార్‌సైకిళ్ల కంటే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను నడపడం మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించాలని తమ ఇంజనీర్ల బృందం కోరుకుంటుందని ఆయన ఓ సందర్భంలో పేర్కొన్నారు.

పీ-స్పోర్ట్ ప్రధాన అంశాలు..

పవర్ ఈవీ నుంచి వచ్చిన పీ-స్పోర్ట్ బైక్ యువతను బాగా ఆకర్షిస్తోంది. దాని లుక్, డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ బైక్ కు సంబంధించిన ప్రధాన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ధర.. ఈ పీ-స్పోర్ట్ బైక్ ప్రారంభ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. టాప్ వేరియంట్ రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

రేంజ్.. ఈ బైక్ లోని బ్యాటరీని సింగిల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 210 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సమకాలీన ఈవీ స్టార్టప్‌లతో పోలిస్తే భారతదేశంలో అత్యుత్తమ రేంజ్ ఇదే. గరిష్ట వేగం గంటకు 85కిలోమీటర్లు ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్ .. ఈ బైక్ లో 72V – 33.6Ah మార్చుకోదగిన బ్యాటరీ సెటప్ ఉంటుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయడానికి ప్రామాణిక ఛార్జర్‌తో 3-4 గంటల సమయం పడుతుంది. దీనిలో మోటార్ 4.8 kWh శక్తిని కలిగి ఉంటుంది. దీని యాక్సెలరేషన్ 6 సెకన్లలో 0 నుంచి 85 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది.

డ్రైవింగ్ మోడ్.. ఈ బైక్ లో మూడు డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. అవి ఎకో (ఎకానమీ పైలటింగ్ మోడ్), స్టాండర్డ్ (ప్రతి రోజూ పర్ఫెక్ట్) టర్బో (మరింత శక్తి, ఎక్కువ వేగం)

ప్రత్యేకతలు.. భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు తగిన విధంగా దీని నిర్మాణం ఉంటుంది. ఎయిర్-కూల్డ్ బ్యాటరీ సాంకేతికతతో అమర్చబడింది. దీనిలో మార్చుకోదగిన బ్యాటరీ కారణంగా వినియోగదారులకు అదనపు ప్రయోజనం ఉంటుంది. బైక్‌తో ఏవైనా సమస్యలు ఉంటే యజమాని/రైడర్‌ను అంచనా వేసి, హెచ్చరించే స్వీయ-నిర్ధారణ సాంకేతికత, అన్ని సమయాల్లో బ్యాటరీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి వ్యక్తిగతీకరించిన మొబైల్ అప్లికేషన్‌తో వినియోగదారు-స్నేహపూర్వక ఫీచర్ ఉంటుంది. కంపెనీ తమ క్లయింట్‌లకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, బ్యాటరీ మార్పిడి, ఒక సంవత్సరం పాటు ఉచిత సేవ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. నగరంలోని వివిధ ప్రదేశాలలో ఎవరికీ ఎలాంటి సమస్యలు రాకుండా వివిధ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

కంపెనీ డీలర్‌షిప్‌లు .. పవర్ ఈవీ మొదటి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తరువాత భారతదేశం అంతటా డీలర్‌షిప్ ఉనికిని విస్తరించాలని కంపెనీ ప్రణాళిక చేసింది. వినియోగదారుల చార్జింగ్ సమస్యలకు పరిష్కారంగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..