
ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా కొత్త మోడళ్లు, అత్యాధునిక ఫీచర్లను వినియోగదారులు కోరుకొంటున్నారు. ఆ విధంగానే కంపెనీలు కూడా కొత్త ప్రయోగాలు చేస్తూ.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశంలోని అతి పెద్ద ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీల్లో ఒకటైన యూలూ ఓ మైక్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆవిష్కరించింది. యూలూ విన్ పేరిట వచ్చిన స్కూటర్ ప్రారంభ సేల్ కింద కేవలం రూ. 55,555 అందిస్తోంది. ప్రారంభ సేల్ ముగిసిన తర్వాత 59,999గా దీని ధర ఉంటుంది. స్కార్లెట్ రెడ్, మూన్ లైట్ వైట్ రంగుల ఆప్షన్లలో అందిస్తున్న ఈ స్కూటర్లను ఆన్ లైన్ లో కేవలం రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అర్బన్ ప్రజల అవసరాల కోసం..
యూలూ కంపెనీ అర్బన్ ప్రజల అవసరాలు, వారు ఆలోచనా విధానాలపై ఎంతో కాలంగా పరిశోధన చేసి ఈ యూలూ విన్ స్కూటర్ ను తీసుకొచ్చింది. అలాగే ఫ్యామిలీ ఎవరైనా ఈజీగా వినియోగించేటట్లు దీనిని రూపొందించారు. ఒక ఫ్యామిలీ ఎవరైనాన తాళం లేకుండా దీనిని వినియోగించవచ్చు.
స్వాపబుల్ బ్యాటరీ..
ఈ విన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మార్చుకోదగిన బ్యాటరీలు ఇచ్చారు. ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలోనే ఈ బ్యాటరీని మార్చుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక స్వాపింగ్ స్టేషన్ పెట్టారు. యూమా ఎనర్జీ నెట్ వర్క్ యూలూ అండ్ మాగ్న సంయుక్తంగా ఈ స్వాపింగ్ స్టేషన్ ను నిర్వహిస్తున్నారు. ఇంటి దగ్గరే పోర్టబుల్ చార్జర్ వినియోగించి బ్యాటరీ చార్జ్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్.. లైసెన్స్ అవసరం లేదు..
విన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పురుషులు గానీ, మహిళలు గానీ ఎవరైనా వినియోగించవచ్చు. దీని డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. దీనిలో ఆన్ ద ఎయిర్(ఓటీఏ)తో కూడిన ఇంటెలిజెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దీంతో ఏ వయసు వారైనా సులభంగా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ కి వెహికల్ రిజిస్ట్రేషన్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ అవసరం లేదని కంపెనీ ప్రకటించింది. 16ఏళ్ల పైబడిని వయసున్న వారు ఎవరైనా ఈ బండిని నడపవచ్చు.
ఓనర్ షిప్ ప్యాక్..
కంపెనీ ఓ ప్రత్యేక ఓనర్ షిప్ ప్యాక్ ను వినియోగదారులకు అందిస్తోంది. ఈ ప్యాక్ తీసుకున్న వారికి స్కూటర్ కాస్ట్ లో 40శాతం వరకూ తగ్గింపు ఉంటుంది. స్కూటర్ బ్యాటరీ కాస్ట్ పూర్తిగా తగ్గుతుంది. వివిధ రకాల ఓనర్ షిప్ ప్యాక్ లను యూలూ కంపెనీ అందిస్తోంది.. వచ్చే డిసెంబర్ కి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను 100 నుంచి 500 వరకూ విస్తరించాలని ప్రణాళిక చేస్తోంది.
యూలూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్ గుప్తా మాట్లాడుతూ విన్ స్కూటర్ అనేది సులభమైన మొబిలిటీలో భారతదేశపు నంబర్ వన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ గా నిలుస్తుందన్నారు. అలాగే బజాబ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ విన్ స్కూటర్లు తమ చేతక్ టెక్నాలజీ ప్లాంట్ లోనే ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..