Bajaj Pulsar 180: వాహన రంగలో దూసుకుపోతున్న బజాజ్ ఆటో.. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని సరికొత్త బైక్‌లను ఉత్పత్తి చేస్తోంది. వాహనదారులను ఆకట్టుకునే విధంగా ఎన్నో రకాల బైక్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మార్కెట్లోకి కొత్త పల్సన్ 180 విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1,07,904 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). 178.6 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌ను స్ల్పిట్ సీట్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యుత్తమ టెక్నాలజీ, వినియోగదారులు ఇష్టపడే విధంగా కొత్త పల్సర్ 180 రూపొందించినట్లు బజాజ్ ఆటో తెలిపింది. గడిచిన 20 ఏళ్లుగా 180-200 సీసీ విభాగంలో పల్సర్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తోందని తెలిపింది. అయితే వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మున్ముందు మరిన్ని కొత్త మోడళ్లలో ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ చెబుతోంది.
కాగా, ఇప్పటికే వాహన రంగానికి సంబంధించిన సంస్థల నుంచి రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లలో ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునే విధంగా కంపెనీ యాజమాన్యం రోజుకో విధంగా కొత్త మోడల్ బైక్‌లను తయారు చేస్తోంది. ఒక మోడల్ ద్విచక్ర వాహనం ఉత్పత్తి అయిన కొన్ని రోజులకే మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారులు కూడా కొత్త కొత్త మోడల్ ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి వస్తుండటంతో పాత బైక్‌లను మార్చేసి కొత్తగా వచ్చిన వాహనాలను తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా వినియోగదారులకు తగ్గట్లుగా వివిధ కంపెనీల యాజమాన్యం కూడా ఆలోచిస్తోంది.
Also Read: BMW R18 Classic Bike: బీఎండబ్ల్యూ నుంచి రూ.24 లక్షల బైక్.. ఇందులో అదిరిపోయే ఫీచర్స్…