AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini AC: ఏసీలు కూడా పనికిరావు.. ఇలా చేస్తే 8 నిమిషాల్లో ఇల్లంతా కూల్.. కూల్‌గా.!

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రమోద్ అనే ఏసీ టెక్నీషియన్ తక్కువ ధరలో ఏసీ కుండను ఆవిష్కరించాడు. ఇది విద్యుత్ రహితంగా చల్లదనాన్ని అందిస్తూ, పర్యావరణానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా, అతడు తయారుచేసిన తక్కువ ఖర్చుతో కూడిన ఆల్కలైన్ వాటర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Mini AC: ఏసీలు కూడా పనికిరావు.. ఇలా చేస్తే 8 నిమిషాల్లో ఇల్లంతా కూల్.. కూల్‌గా.!
Mini Ac
Ravi Kiran
|

Updated on: Mar 31, 2026 | 9:35 AM

Share

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. వేడి, ఉక్కపోతతో జనాలు కొట్టుమిట్టాడుతుంటారు. చల్లని గాలి కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఫ్యాన్, ఏసీ, కూలర్ ఇలా ఏది దొరికితే దాని కింద చల్లదనాన్ని ఆస్వాదిస్తారు. వివరాల్లోకి వెళ్తే..! నిజామాబాద్ జిల్లా చెక్‌పేట్ గ్రామానికి చెందిన ప్రమోద్ అనే ఏసీ టెక్నీషియన్.. సామాన్య ప్రజల కష్టాలను తీర్చేందుకు తన మేధస్సుకు పదును పెట్టి రెండు అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. ‘ఏసీ కుండ’, ‘ఆల్కలైన్ వాటర్’ పరికరాన్ని రూపొందించాడు. మార్కెట్లో లభించే ఖరీదైన ఏసీలు సామాన్యులకు భారంగా మారిన తరుణంలో, కేవలం మట్టి కుండ, కూలింగ్ ప్యాడ్లు, వట్టివేర్ల సాయంతో తక్కువ విద్యుత్ ఖర్చుతో పనిచేసే ఏసీ కుండను అతడు అందుబాటులోకి తెచ్చారు. ఇది నీటి బాష్పీభవన సూత్రంపై పనిచేస్తూ, వర్షం పడినప్పుడు వచ్చే చల్లదనాన్ని గదిలో నింపుతుంది. మట్టి సహజంగా కార్బన్ డయాక్సైడ్ లాంటి విషవాయువులను పీల్చుకుంటుంది కాబట్టి, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సుమారు 18 కిలోల బరువుండే ఈ కుండలో 35 లీటర్ల నీటిని నింపవచ్చు. దీనివల్ల వచ్చే వట్టివేర్ల సువాసన రక్తపోటు వంటి సమస్యలను తగ్గించడానికి దోహదపడుతుంది.

అలాగే తక్కువ ఖర్చుతో కూడిన ఆల్కలైన్ వాటర్ పరికరం. నేటి కాలంలో కలుషిత నీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించాడు. మట్టి పాత్రల ద్వారా సహజ సిద్ధమైన ఆల్కలైన్ నీటిని అందించే మార్గాన్ని కనిపెట్టాడు. మట్టిలో ఉండే స్వతహా సిద్ధమైన గుణాలు నీటిలోని 18 రకాల సూక్ష్మపోషకాలను రక్షిస్తాయి. శరీరంలోని రక్తం pH స్థాయిని సమతుల్యం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిరూపించాడు. ముఖ్యంగా థైరాయిడ్, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ నీరు ఎంతో మేలు చేస్తుందని ఆయన ల్యాబ్ రిపోర్టుల ద్వారా ధృవీకరించాడు. పక్షవాతంతో బాధపడుతున్న పలువురు పేదలకు ఈ నీటిని ఉచితంగా అందించి, వారి ఆరోగ్యంలో గొప్ప మార్పును చూశాడు. ఆరోగ్యం అనేది కేవలం మందుల మీదనే కాకుండా మనం తాగే నీరు, తినే ఆహారం, ఆలోచనలపై కూడా ఆధారపడి ఉంటుందని అంటున్నాడు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!