Silver Price Today (06-02-2021): వెండి ప్రియులకు శుభవార్త. వెండి ధరలు ఈ రోజు కూడా దిగి వచ్చింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ సందర్భంగా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనతో బంగారం, వెండి ధరలు వెనుకంజ వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ధరలు దిగి వస్తున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధర తగ్గుతుండగా, అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండిపై రూ.700 వరకు తగ్గింది. ప్రస్తుత ఢిల్లీలో కిలో వెండి రూ.67,300 ఉండగా, హైదరాబాద్‌లో 72,600 ఉంది, కోల్‌కతాలో కిలో వెండి రూ.67,300 ఉండగా, ముంబైలో కిలో వెండి రూ.67,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.72,600 ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.