MY Home : 35 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ వన్‌గా ఉన్న మైహోమ్ సంస్థ మరో రికార్డు సృష్టించింది. నమ్మకానికి మారుపేరుగా ఉన్న సంస్థపై మరోసారి తమ విశ్వాసాన్ని చూపించారు కస్టమర్లు. నిన్న గ్రాండ్‌గా లాంచ్ అయిన సయూక్‌లో ఫ్లాట్ల అమ్మకాలు సింగిల్ డే రికార్డును నెలకొల్పాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి మైహోమ్ సంస్థ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గ్రాండ్‌గా లాంచ్ అయిన మైహోమ్ సయూక్ ప్రాజెక్టుకు అన్నివర్గాల నుంచి ఆదరణ భారీగా కనిపిస్తోంది. మైహోమ్ సయూఖ్‌లో ఫ్లాట్‌ను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు కస్టమర్లు. ఒక్క రోజులోనే 1125ఫ్లాట్లు అమ్ముడయ్యాయంటే.. జనాదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సొంత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది మైహోమ్ సంస్థ. 2016లో మైహోమ్ అవతార్‌లో 1000కి పైగా ఫ్లాట్లు ఒక్కరోజులోనే అమ్ముడు పోగా.. ఇప్పుడు 1125 ఫ్లాట్లతో మైహోమ్ సయూక్ న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తం 1800కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లు అమ్ముడుపోయినట్లు సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతులమీదుగా మైహోమ్ సయూక్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌తోపాటు.. మైహోమ్ సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, మైహోమ్ డైరెక్టర్ రామురావు, మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ శ్యామ్ రావు.. ఈ ప్రాజెక్టులో పార్ట్నర్ అయిన ప్రతిమ గ్రూప్ ఎండీ శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు.
మొత్తం 25.37 ఎకరాల్లో సయూక్ గేటెడ్ కమ్యూనిటీ రూపుదిద్దుకోబోతోంది. ఇందులో 2 BHK, 2.5BHK , 3BHK వేరియేషన్స్‌లో 3700పైగా ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 12 టవర్లు.. ఒక్కో టవర్‌లో 40 అంతస్థులు ఉంటాయని మైహోమ్ సంస్థ తెలిపింది. సయూక్‌లో 82శాతం ఓపెన్ ఏరియా ఉంటుంది.. ఇందులో లక్ష స్క్వేర్ ఫీట్లలో క్లబ్ హౌస్‌తోపాటు.. లగ్జరీ ఎమినిటీస్ కూడా లభ్యమవుతాయి. ప్రస్తుతం 12 టవర్లలోని ఆరు టవర్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మైహోమ్ అంటే గృహాలనిర్మాణాలే కాదు.. కస్టమర్ల దగ్గర నమ్మకాన్ని కూడా నిర్మించామంది సంస్థ. అందుకే ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నామన్నారు మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ శ్యామ్ రావు.