Multibagger stocks: భారీ రాబడిని ఇచ్చిన స్మాల్‌క్యాప్ స్టాక్స్‌.. ఆ ఐదు కంపెనీలు ఏమిటంటే..

|

Feb 07, 2022 | 9:46 AM

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు 2022కి సాధ్యమయ్యే మల్టీబ్యాగర్ స్టాక్‌ల(Multibagger stocks)ను కనుగొనడంలో...

Multibagger stocks: భారీ రాబడిని ఇచ్చిన స్మాల్‌క్యాప్ స్టాక్స్‌.. ఆ ఐదు కంపెనీలు ఏమిటంటే..
Bulk Deal
Follow us on

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు 2022కి సాధ్యమయ్యే మల్టీబ్యాగర్ స్టాక్‌ల(Multibagger stocks)ను కనుగొనడంలో బిజీగా ఉండగా, కొన్ని స్మాల్-క్యాప్ స్టాక్‌లు ఇప్పటికే 2022లో మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలోకి ప్రవేశించాయి. అయితే ఇలాంటి స్టాక్‌ల్లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్న విషయమని స్టాక్ మార్కెట్(Stock Market) నిపుణులు చెబుతున్నారు. గత ఒక నెలలో మల్టీబ్యాగర్ రాబడిని అందించిన 5 స్మాల్-క్యాప్ స్టాక్‌(small cap stocks)లు ఏంటో చూద్దాం..

మాగెల్లానిక్ క్లౌడ్

గత ఒక నెలలో ఈ BSEలో రూ.87.30 టాప్ రూ.231లకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 165 శాతం పెరిగింది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్ దాదాపు రూ. 581 కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. P/E నిష్పత్తి 17.34. గా ఉంది. ఈ స్టాక్ శుక్రవారం ట్రేడ్ సెషన్‌లో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.231 స్థాయికి చేరుకుంది.

సెజల్ గ్లాస్

ఇది ‘T’ గ్రూప్ స్టాక్, ఇది గత నెలలో రూ.29.45 నుండి రూ.77.35 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 162 శాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.77.35 లక్షలు కాబట్టి స్టాక్‌లో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇది ప్రస్తుతం 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. డిసెంబర్ 2021 నెలలో NSEలో 52 వారాల కనిష్ఠానికి రూ.13. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ గత ఒకటిన్నర సంవత్సర కాలంలో 390 శాతం రాబడిని అందించింది.

టైన్ ఆగ్రో

ఈ స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ గత నెలలో రూ.8.25 నుంచి రూ.21.60కి పెరిగింది. దాని వాటాదారులకు దాదాపు 162 శాతం రాబడిని అందించింది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12 కోట్లుగా ఉన్నందున స్టాక్ చాలా తక్కువ లిక్విడిటీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మాల్-క్యాప్ స్టాక్ దాని 52-వారాల గరిష్ట స్థాయి వద్ద ఉంది.

మైత్రి ఎంటర్‌ప్రైజెస్

ఈ మల్టీబ్యాగర్ స్మాల్-క్యాప్ స్టాక్ గత ఒక నెలలో రూ.22.70 నుంచి రూ.59.30 వరకు పెరిగింది. ఈ సమయంలో దాదాపు 161 శాతం పెరిగింది.

ARC ఫైనాన్స్

ఈ ‘X’ గ్రూప్ స్టాక్ ఒక్కో రూ.13.11 నుండి 34.15 వరకు పెరిగింది. ఈ కాలంలో 160 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.172 కోట్లుగా ఉంది.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also.. Digital rupee: డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి.. డిజిటల్, క్రిప్టో కరెన్సీకి మధ్య తేడా ఏంటి..