AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షను 69 లక్షలు చేసిన కుబేర స్టాక్.. 5 ఏళ్లలోనే ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు..

లక్ష రూపాయిలు పెడితే.. ఏకంగా 69 లక్షల లాభం. ఐదేళ్లలోనే ఇన్వెస్టర్ల జాతకాన్ని మార్చేసిన కుబేర స్టాక్.. షేర్ మార్కెట్‌లో రైట్ టైమ్‌లో రైట్ స్టాక్ పడితే లైఫ్ ఎలా సెట్ అవుతుందో చెప్పడానికి ఈ హెల్త్‌కేర్ కంపెనీయే ఒక ఉదాహరణ. అప్పుల్లేని ఈ కంపెనీ లాభాల్లో ఎలా దూసుకుపోతుంది..? ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభాలను ఇచ్చిందో తెలుసుకుందాం..

లక్షను 69 లక్షలు చేసిన కుబేర స్టాక్.. 5 ఏళ్లలోనే ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు..
Debt Free Multibagger Stock Delivers 6,900 Percent Return
Krishna S
|

Updated on: Jun 19, 2026 | 3:15 PM

Share

షేర్ మార్కెట్‌లో ఓపిక, సరైన స్టాక్ ఎంపిక ఉంటే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. హెల్త్‌కేర్, ఐటీ సేవల రంగంలో దూసుకుపోతున్న వన్ గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ షేరు పెట్టుబడిదారులపై కాసుల వర్షం కురిపించింది. గత ఐదేళ్ల కాలంలో ఈ స్టాక్ ఏకంగా 6,900 శాతం మెరుపు లాభాలను అందించి అసలైన మల్టీబ్యాగర్‌గా అవతరించింది. ఐదేళ్ల క్రితం.. అంటే జూన్ 2021 సమయంలో ఈ కంపెనీ షేరు ధర కేవలం రూ.9 నుంచి రూ.10 మధ్య వద్ద ట్రేడవుతుండేది. అప్పట్లో ఈ కంపెనీపై నమ్మకంతో ఒక పెట్టుబడిదారుడు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి, వాటిని అలాగే ఉంచి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఏకంగా రూ.69 లక్షల పైగా ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,427 కోట్లుగా ఉంది.

బలమైన ఫండమెంటల్స్.. అప్పుల్లేని కంపెనీ..

ఈ భారీ వృద్ధికి కేవలం మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే కారణం కాదు కంపెనీ చూపించిన అద్భుతమైన ఆర్థిక ప్రదర్శనే దీనికి ముఖ్య కారణం. ఈ కంపెనీపై ప్రస్తుతం ఎలాంటి అప్పుల భారం లేదు. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని నిలబడటానికి ఇది పెద్ద సానుకూలాంశం. ఆర్థిక సంవత్సరం 2026 వార్షిక ఫలితాల ప్రకారం కంపెనీ మొత్తం ఆదాయం (Total Revenue) 276% పెరిగి ఏకంగా ₹69.5 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం కూడా గత ఏడాది ఉన్న రూ.5.8 కోట్ల నుండి ఏకంగా రూ.22.1 కోట్లకు దూసుకెళ్లింది. గత ఏడాదిలో ప్రమోటర్ల వాటా 15.1 శాతంగా ఉండగా, కంపెనీ విలీన ప్రక్రియ తర్వాత కొత్త ప్రమోటర్ షేర్ల జారీతో అది ఇప్పుడు ఏకంగా 68.4 శాతానికి పెరిగింది. ప్రమోటర్లకు కంపెనీపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం.

ఎక్కువ మంది చదివినది: ఏసీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా.. మీ రిమోట్‌లోని ఈ బటన్ నొక్కండి.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్ ఇవే.

తక్కువ వాల్యుయేషన్.. ఇంకా పెరిగే ఛాన్స్?

ప్రస్తుతం ఈ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో దాదాపు 16 నుండి 20 రెట్లు మాత్రమే ఉంది. ఈ హెల్త్‌కేయర్ ఇండస్ట్రీ సగటు P/E (దాదాపు 79-80 రెట్లు) తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంటే ఇంత పెరిగినప్పటికీ ఈ స్టాక్ ఇంకా సరసమైన ధరలోనే లభిస్తోందని, భవిష్యత్తులో మరింత వృద్ధి చెందే సత్తా దీనికి ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ ఇటీవల రూ.1 ఫైనల్ డివిడెండ్‌ను కూడా సిఫార్సు చేసింది.

Follow Us