AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Tips: ఏసీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా.. మీ రిమోట్‌లోని ఈ బటన్ నొక్కండి.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..

వానాకాలం మొదలైన ఎండలు మాత్రం దంచుతున్నాయి. రాత్రిపూట ఉక్కపోత చుక్కలు చూపిస్తుంది. దీంతో ఏసీ, కూలర్లు అనివార్యంగా మారాయి. కొద్దిసేపు ఏసీ లేకున్నా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే రాత్రంతా ఏసీ ఆన్‌లో ఉంటే కరెంట్ బిల్ మోత మోగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మీ రిమోట్‌లోని ఒక్క చిన్న ట్రిక్‌తో ఆ బిల్‌ను భారీగా తగ్గించుకోవచ్చు.

AC Tips: ఏసీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా.. మీ రిమోట్‌లోని ఈ బటన్ నొక్కండి.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..
Ac Sleep Mode Benefits
Krishna S
|

Updated on: Jun 18, 2026 | 6:54 PM

Share

వర్షాకాలం మొదలైన ఎండలు, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీంతో ఇల్లు, ఆఫీసుల్లో ఏసీ అనివార్యంగా మారింది. కొద్దిసేపు ఏసీ లేకున్నా ఉబ్బరంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక రాత్రి పూట ఏసీ లేకపోతే నిద్రపట్టడం గగనంగా మారింది. అయితే రాత్రంతా ఏసీ ఆన్ చేసి ఉంచితే.. నెల తిరిగేసరికి వచ్చే కరెంట్ బిల్లు చూసి గుండె గుభేల్ అంటుంది. కానీ మీ ఏసీ రిమోట్‌లో ఉండే ఒకే ఒక్క స్మార్ట్ ఫీచర్‌తో కరెంట్ బిల్‌ను సగానికి సగం తగ్గించుకోవచ్చు. సాధారణంగా రాత్రి పడుకునేటప్పుడు రూమ్ బాగా చల్లగా ఉండాలని తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటాం. కానీ అర్ధరాత్రి దాటాక వాతావరణం సహజంగానే కొద్దిగా చల్లబడుతుంది. ఆ సమయంలో ఏసీ అదే టెంపరేచర్‌పై నడవడం వల్ల రూమ్ మరీ ఎక్కువగా చల్లబడిపోతుంది. దీనివల్ల చలి వేసి, నిద్ర మధ్యలో లేచి దుప్పటి కప్పుకోవాల్సి వస్తుంది. కానీ మీరు స్లీప్ మోడ్ ఆన్ చేస్తే.. అది ప్రతి గంటకు 1 డిగ్రీ చొప్పున టెంపరేచర్‌ను పెంచుతూ పోతుంది. దీనివల్ల శరీరంపై అదనపు భారం పడకుండా, చలి పెట్టకుండా హాయిగా నిద్రపడుతుంది.

కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది

ఎలక్ట్రిసిటీ వినియోగం విషయానికి వస్తే స్లీప్ మోడ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఏసీ కంప్రెషర్ నిరంతరం హై పవర్ మీద రన్ అవ్వకుండా రూమ్ టెంపరేచర్‌ను బట్టి తక్కువ పవర్‌ను ఉపయోగించుకుంటుంది. కంప్రెషర్ లోడ్ తగ్గడం వల్ల కరెంట్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా మీ నెలవారీ విద్యుత్ బిల్లులో మంచి పొదుపు కనిపిస్తుంది. అలాగే ఏసీ విడిభాగాల ఆయుష్షు కూడా పెరుగుతుంది.

శబ్దం లేని ప్రశాంతమైన వాతావరణం

స్లీప్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఏసీ లోపల ఉండే ఫ్యాన్ స్పీడ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. దీనివల్ల ఏసీ నుంచి వచ్చే చిన్నపాటి శబ్దం కూడా తగ్గిపోయి, గదిలో పూర్తి నిశ్శబ్దం నెలకొంటుంది. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా గాఢ నిద్ర పోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. కరెంట్ బిల్లుకు భయపడి ఏసీ ఆన్ చేయడానికి వెనకాడాల్సిన పనిలేదు. రాత్రి పడుకునే ముందు మీ ఏసీ రిమోట్‌లో Sleep Mode బటన్ నొక్కండి.. హాయిగా నిద్రపోండి.

చాలా మందికి వచ్చే డౌట్లు..

ప్రశ్న: స్లీప్ మోడ్ ఆన్ చేస్తే కరెంట్ బిల్లు నిజంగానే తగ్గుతుందా?

జవాబు: అవును, ఖచ్చితంగా తగ్గుతుంది. స్లీప్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏసీ కంప్రెషర్ నిరంతరం ఒకే హై స్పీడ్‌లో నడవకుండా, రూమ్ టెంపరేచర్‌ను బట్టి తక్కువ పవర్‌ను వాడుకుంటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు గణనీయంగా ఆదా అవుతుంది.

ప్రశ్న: స్లీప్ మోడ్ వల్ల ఏసీ లైఫ్ పెరుగుతుందా?

జవాబు: అవును. ఏసీ కంప్రెషర్, ఇతర విడిభాగాలపై లోడ్ తగ్గడం వల్ల అవి త్వరగా పాడవవు.

ప్రశ్న:రాత్రి పూట ఈ మోడ్ నిద్రకు ఎలా సహాయపడుతుంది?

జవాబు: వాతావరణం చల్లబడినప్పుడు సాధారణ ఏసీ గదిని మరింత కూల్ చేసేస్తుంది. దానివల్ల చలి పెరిగి నిద్ర పాడవుతుంది. కానీ స్లీప్ మోడ్ టెంపరేచర్‌ను పెంచడం వల్ల గదిలో ఎక్కువ చలి పెట్టకుండా హాయిగా నిద్రపడుతుంది.

Follow Us