Jio Plan: అంబానీయా మజాకా.. రూ.100తో డేటా ప్లాన్‌.. 90 రోజుల వ్యాలిడిటీ!

Jio Plan: రిలయన్స్‌ జియో తన వినియోగదారుల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు అదిపోయే ప్లాన్‌లో ముందుకొచ్చింది. ఈ ప్లాన్‌ వినియోగదారులకు ఆశ్చర్యపర్చేలా ఉంటుంది. కేవలం 100 రూపాయలతోనే 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండే డేటా ప్లాన్‌ను తీసుకువచ్చింది..

Jio Plan: అంబానీయా మజాకా.. రూ.100తో డేటా ప్లాన్‌.. 90 రోజుల వ్యాలిడిటీ!

Updated on: Aug 27, 2025 | 9:54 PM

ఈ రోజుల్లో చాలా ఎక్కువ డేటా ప్రయోజనాలతో వచ్చే రీఛార్జ్ ప్లాన్‌లను ఇష్టపడతారు. BSNL, Jio, Airtel, Vodafone Idea వంటి కంపెనీలు కూడా వివిధ ప్లాన్‌లను అందిస్తున్నాయి. బడ్జెట్ తక్కువగా ఉంటే అటువంటి వినియోగదారులకు రూ. 100 లేదా అంతకంటే తక్కువ ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో 90 రోజుల చెల్లుబాటుతో వచ్చే రూ. 100 ప్లాన్‌ గురించి తెలుసుకుందాం. ఇది వినియోగదారులకు మరిన్ని డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Coriander Storage Hacks: మీ ఇంట్లో కొత్తిమీర వాడిపోతుందా? ఇలా చేస్తే తాజాగా ఉంటుంది.. అద్భుతమైన ట్రిక్స్‌!

రిలయన్స్ జియో 90 రోజుల చెల్లుబాటుతో రూ.100 ప్లాన్‌ను అందిస్తోంది. జియో నుండి ఈ చౌకైన రీఛార్జ్ అనేది 90 రోజుల పాటు వినియోగదారులకు డేటా ప్రయోజనాలను అందించే డేటా ప్లాన్.

ఇవి కూడా చదవండి

జియో రూ.100 ప్లాన్ 5GB డేటా బెనిఫిట్‌తో వస్తుంది. వినియోగదారులు 90 రోజుల పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు. 5G కనెక్టివిటీ ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. అంతేకాకుండా, డేటా అయిపోయిన తర్వాత కూడా, మీరు తక్కువ వేగంతో ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్‌ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో..

ఈ రీఛార్జ్ ప్లాన్ తో 90 రోజుల OTT ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 100 రీఛార్జ్ తో మీరు మొత్తం 5GB డేటా, JioHotstar కు ఉచిత సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్లకు రూ.100 డేటా ప్లాన్ ప్రయోజనం లభిస్తుంది. సరళంగా చెప్పాలంటే జియో ఈ ప్లాన్ ప్రస్తుత ప్లాన్‌తో అందుబాటులో ఉంది. మీరు యాక్టివ్ ప్లాన్‌తో జియో రూ.100 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: DMart vs Reliance Retail: డిమార్ట్ vs రిలయన్స్ రిటైల్.. చౌకైన షాపింగ్‌ కోసం ఏది బెస్ట్‌?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి