AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: అంబానీ అయోధ్య రామమందిరానికి విరాళం ఎంత ఇచ్చారో తెలుసా?

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కుమార్తె ఇషా అంబానీ, పిల్లలు ఆకాష్ అంబానీ-అనంత్ అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమల్, కోడలు శ్లోక హాజరయ్యారు. అంబానీ కుటుంబం అంతా కట్టుదిట్టమైన భద్రతతో విమానాశ్రయం నుంచి రామాలయానికి చేరుకున్నారు. ఈసారి జై శ్రీరామ్.. చారిత్రాత్మకమైన రోజు. భారతీయ సంస్కృతికి నేను గర్విస్తున్నాను అని నీతా అంబానీ అన్నారు..

Mukesh Ambani: అంబానీ అయోధ్య రామమందిరానికి విరాళం ఎంత ఇచ్చారో తెలుసా?
Mukesh Ambani Family
Subhash Goud
|

Updated on: Jan 23, 2024 | 8:11 PM

Share

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యే కాదు యావత్ దేశం రామలల్లా భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. నేటి చారిత్రాత్మక వేడుకకు అన్ని రంగాలకు చెందిన అనుభవజ్ఞులను ఆహ్వానించారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకకు హాజరయ్యారు. రామమందిరం ట్రస్టుకు ముఖేష్ అంబానీ ఇచ్చిన విరాళం వెలుగులోకి వచ్చింది.

నేను భారతీయ సంస్కృతికి గర్వపడుతున్నాను- నీతా అంబానీ

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కుమార్తె ఇషా అంబానీ, పిల్లలు ఆకాష్ అంబానీ-అనంత్ అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమల్, కోడలు శ్లోక హాజరయ్యారు. అంబానీ కుటుంబం అంతా కట్టుదిట్టమైన భద్రతతో విమానాశ్రయం నుంచి రామాలయానికి చేరుకున్నారు. ఈసారి జై శ్రీరామ్.. చారిత్రాత్మకమైన రోజు. భారతీయ సంస్కృతికి నేను గర్విస్తున్నాను అని నీతా అంబానీ అన్నారు.

ఇవి కూడా చదవండి

అంబానీ ఎన్ని కోట్లు విరాళం ఇచ్చారు

రామమందిరం ట్రస్టుకు ముఖేష్ అంబానీ 2.51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. దీపావళి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఈ క్షణాన్ని చూడటం నా అదృష్టంగా భావిస్తున్నానని ముఖేష్ అంబానీ అన్నారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం ఆనందంగా, ఉత్సాహంగా కనిపించింది. ఈ రోజు చరిత్ర పుటల్లో లిఖించబడుతుందని ఆకాష్ అంబానీ అన్నారు. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజులని ఇషా అంబానీ అన్నారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సమక్షంలో గర్భగుడిలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి