Budget 2024: హోమ్ లోన్ తీసుకున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు.? వారి వినతులపై..
అయితే హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఉపశమనం లభించనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీని మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఇందులో సామాన్యులకు భారీ ఊరట లభించే అవకాశాలు...
సొంతిళ్లు.. ఇది ప్రతీ ఒక్కరి కల. ఎప్పటికైనా సొంతింటిని నిజం చేసుకోవాలనే ఆశతో ఉంటారు. ఇక బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుండడం, సులభమైన ఈఎమ్‌ఐ విధానం అందుబాటులోకి తేవడంతో చాలా మంది తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. అయితే హోమ్ లోన్ చెల్లించే సమయంలో మాత్రం సుదీర్ఘ కాలం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోమ్‌లోన్ అసలు, వడ్డీపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఉపశమనం లభించనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీని మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఇందులో సామాన్యులకు భారీ ఊరట లభించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈ బడ్జెట్‌లో భారీ ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఇప్పటికే రియల్ ఎస్టేట్ పరిశ్రమ నుంచి వినతులు వచ్చాయి. హోమ్ లోన్ అసలు, వడ్డీ పేమెంట్లపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో హోమ్ లోన్ పై ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రతిపాదనలు అమలు చేయాల్సిందిగా క్రెడాయ్ కోరింది.
ప్రస్తుతం గృణ రుణాలకు సంబంధించి.. చెల్లిస్తున్నఅసలుకు సెక్షన్ 80సీ పరిమితి రూ. 1,50,000 వరకు పన్ను మినహాయింపు వర్తిస్తోంది. అలాగే వడ్డీకి సెక్షన్ 24 (బి) ప్రకారం రూ. 2 లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. పాత పన్న విధానంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అసలు పేమెంట్స్ మొత్తానికి ప్రత్యేక స్టాండర్డ్ డిడక్షన్ వర్తింప జేయాలని క్రెడాయ్ కోరింది.
2017లో గృహాల విలువ రూ. 45 లక్షలుగా నిర్ణయించార. అయితే ప్రస్తుతం పెరిగిన ద్రవ్యోల్బణం, గత ఏడేళ్లుగా స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ లిమిట్ సరిపోదని క్రెడాయ్ కేంద్రానికి తెలిపింది. దీంతో దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తున్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ క్రెడాయ్ తెలిపిన అంశాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..