New Year: న్యూఇయర్ వేడుకలు అంగరంగవైభవంగా సాగాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఎంతో సంబురంగా కొత్తేడాదికి ఆహ్వానం పలికారు. ఇక న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది డిసెంబర్ 31 రాత్రి వేడుకలు. కొత్త ఏడాదికి ఆహ్వానం పలికే తొలి క్షణాలు అందరూ ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. మందు బాబులు మధ్యంతో ఎంజాయ్ చేస్తే, ఫుడ్ లవర్స్ తమకునచ్చిన డిషెస్‌ను లాగించేస్తుంటారు. ఇక ప్రతీ ఏటా డిసెంబర్ 31న మద్యం రికార్డు స్థాయిలో అమ్ముడుపోతుందనే విషయం తెలిసిందే. అయితే కేవలం మద్యానికే పరిమితం కాకుండా ఈసారి ఫుడ్‌ను కూడా తెగలాగించేశారు.
డిసెంబరు 31 అర్ధరాత్రి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరి యాప్స్‌లో బుక్ అయిన ఆర్డర్స్ దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. న్యూఇయర్ జోష్‌లో భాగంగా స్విగ్గీలో ఏకంగా నిమిషానికి ఏకంగా 9500 ఆర్డర్లతో గత రికార్డుల్ని దాటేసింది. ఇక రెండో స్థానంలో 7100 ఆర్డర్లతో జొమాటో నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఫుడ్‌డెలివరీలు జరిగాయి. 2021 కొత్త ఏడాది వేడుకల్లో 5500 ఆర్డర్లు డెలివరీ చేసిన స్విగ్గీ ఈ ఏడాది పాత రికార్డును దాటేసింది. ఇక కొత్తేడాది ఫుడ్ డెలివరీల్లో బెగంళూరులో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది. కరోనా నేపథ్యంలో జనాలు ఎక్కువగా హోటళ్లకు నేరుగా వెళ్లడానికి ఆసక్తి చూపించకపోవడంలో వల్లే ఆన్‌లైన్ ఆర్డర్లు భారీగా పెరిగినట్లు సమాచారం.
Also Read: Silver Price Today: దేశంలో పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
TS Corona: తెలంగాణాలో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు.. మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా