దేశంలో సెమీకండక్టర్ కొరత ఏర్పడడంతో వచ్చే 2-3 సంవత్సరాలలో కనీసం డజను సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలను స్థాపించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. చిప్‌ల తయారీ పరిశ్రమ కోసం మొత్తం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచార మరియు సాంకేతిక మంత్రి బుధవారం అన్నారు. జనవరి1, 2022 నుంచి ప్రోత్సాహక పథకాల కింద దరఖాస్తులను స్వీకరిస్తామని రైల్వే, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. “పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. పారిశ్రమికవేత్తలు మాతో మాట్లాడుతున్నారు” అని వైష్ణవ్ అన్నారు.
గత వారం సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీని పెంచడానికి భారత ప్రభుత్వం రూ.76,000 కోట్ల పథకాన్ని ఆమోదించింది. ఎలక్ట్రానిక్స్ తయారీలో లక్ష మందికి పరోక్ష ఉపాధితో పాటు 35,000 ప్రత్యేక ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. సెమీకండక్టర్ పరిశ్రమలతో దేశంలో వాటి కొరత తీరే అవకాశం ఉంది. అయితే సెమీకండక్టర్ల తయారీకి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఉంది. సెమీకండక్టర్లను కార్లు, ద్విచక్రవాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.
COVID-19 మహమ్మారి ఫలితంగా సెమీకండక్టర్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం ఈ ప్రణాళికను ఇప్పటికే నోటిఫై చేసిందని, కాంపౌండ్ సెమీకండక్టర్ యూనిట్లు, డిజైన్, ప్యాకేజింగ్ కంపెనీలు వచ్చే 3-4 నెలల్లో ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు వైష్ణవ్ తెలిపారు. “రాబోయే 2-3 సంవత్సరాల కాల వ్యవధిలో, మేము కనీసం 10-12 సెమీకండక్టర్స్ పరిశ్రమలు ఉత్పత్తికి వెళ్తాయని ఆశిస్తున్నామన్నారు.
Read Also.. Multibagger Stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. సంవత్సరంలో రూ. 44 లక్షలు అయ్యాయి..