Recharge Prices: భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఏకంగా 15 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5జీ విస్తరణ కోసం టెలికాం కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో ఈ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్దమవుతున్నాయి. అతి త్వరలోనే ధరలు భారీగా పెరగనున్నాయి.

Recharge Prices: భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
Mobie Recharge

Updated on: Jul 06, 2026 | 3:08 PM

మొబైల్ వినియోగదారులకు భారీ షాక్. రీఛార్జ్ ధరలు భారీగా పెరగనున్నాయి. మరోసారి ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్దమవుతున్నాయి. ఈసారి దాదాపు 12 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనర్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. రానున్న 3 నుంచి 4 నెలల్లో పెంపు ఉండనున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు టెలికాం నెట్‌వర్క్ కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే అవకాశముందని తెలుస్తోంది.

త్వరలోనే పెరగనున్న రీఛార్జ్ ధరలు

మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశముందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. గత కొద్ది నెలలుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఎట్టకేలకు పెంపునకు రంగం సిద్దమైంది. ఈ సారి భారీగా పెంచే అవకాశముండటంతో.. వినియోగదారులు రీఛార్జ్ కోసం భారీగా చెల్లించక తప్పదు. దీంతో మొబైల్ వాడేవారికి ఖర్చు పెరగనుంది. 4జీ,5జీ వినియోగం పెరగడంతో డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో కంపెనీలకు కూడా నెట్‌వర్క్ విస్తరణ కోసం ఖర్చు పెరుగుతోంది. అలాగే పోస్ట్ పోయిడ్ యూజర్లు కూడా పెరుగుతున్నారు. దీని వల్ల కంపెనీలకు ఆదాయం కూడా పెరుగుతోంది. జూన్ త్రైమాసికంలో టెలికాం కంపెనీల సగటు ఆదాయం 1 నుంచి 1.5 శాతానికి పెరిగింది.

పెరుగుతున్న కంపెనీల ఆదాయం

వినియోగదారులు 2జీ నుంచి 4జీ, 5జీ నెట్‌వర్క్‌కు మారుతున్నారు. దీంతో మొబైల్ టెలికాం కంపెనీలకు ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. దేశంలో దాదాపు 90 శాతానికిపైగా జిల్లాల్లో జియో, ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. ఇక వొడాఫోన్ ఐడియా దాదాపు 100 సిటీల్లో 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఎయిర్‌టెల్, జియో కంపెనీలు దేశంలో టాప్ టెలికాం కంపెనీలుగా ఉన్నాయి. ప్రతీ నెలా కొత్త సబ్‌స్కైబర్లను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉన్నాయి. త్రైమాసికం ప్రకారం చూస్తే జియో 70 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంటుండగా.. ఎయిర్‌టెల్ 50 లక్షల మంది చేరుతున్నారు. ఇక వొడాఫోన్ ఐడియాలో 2 లక్షల మంది చేరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us