EV Cars: బాబోయ్ బాహుబలి కారు భయ్యా.! ఒక్కసారి ఛార్జ్‌తో 449 కిలోమీటర్లు జాలీ జాలీగా..

టాటా పంచ్, టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీనిచ్చిన MG విండ్సర్ EV హై రేంజ్ వేరియంట్ అయిన MG విండ్సర్ ప్రో ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు ఎంత రేంజ్ ఇస్తుంది. ఎలా డ్రైవ్ చేయవచ్చు.? ఇప్పుడు చూద్దాం..

EV Cars: బాబోయ్ బాహుబలి కారు భయ్యా.! ఒక్కసారి ఛార్జ్‌తో 449 కిలోమీటర్లు జాలీ జాలీగా..
Mg Motors

Updated on: May 14, 2025 | 7:47 PM

మార్కెట్‌లోని పోటితత్వాన్ని తట్టుకుంటూ ఎప్పటికప్పుడు న్యూ మోడల్ కార్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది ఎంజీ మోటార్స్. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా పంచ్, టాటా నెక్సాన్‌ లాంటి వాటికీ గట్టి పోటీనిస్తూ.. ఇటీవల ఎంజీ మోటార్స్ విండ్సర్ మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇక ఇప్పుడు దాని 2.0 వెర్షన్ కింద MG విండ్సర్ ప్రోను లాంచ్ చేసింది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 449 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. టీవీ9 బృందం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు MG విండ్సర్ ప్రోలో ప్రయాణించి.. కారు స్పెసిఫికేషన్లపై రివ్యూ చేసింది. MG విండ్సర్ ప్రోలో 52.9 kWh బ్యాటరీ అమర్చబడి ఉంది. అలాగే నాలుగు టైర్స్‌కి హెక్టర్ అల్లాయ్ వీల్స్ లుక్ ఇచ్చారు. అలాగే ఈ కారుకు ఇప్పుడు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ కూడా ఉంది. బ్యాటరీ ప్యాక్ పెరగడం వల్ల కారు బూట్ స్పేస్ తగ్గింది. ఇది MG విండ్సర్ EV కంటే 25 లీటర్లు తక్కువ ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 17.49 లక్షలుగా ఉంది. అలాగే బ్యాటరీ సెపరేట్‌గా తీసుకుంటే.. దీని ధర రూ. 12.49 లక్షలుగా ఉంది. ఈ ధర మొదటి 8000 బుకింగ్‌లకు మాత్రమే. ఫస్ట్ 24 గంటల్లోనే ఈ కారు సేల్స్ జోరుగా సాగాయి. షిల్లాంగ్ లాంటి కొండ ప్రాంతంలో ఈ కారును అత్యంత సులువుగా నడపవచ్చు. ఇతర SUVలు లేదా క్రాస్ఓవర్ల మాదిరిగా ఇది బోల్డ్‌గా లేకపోయినప్పటికీ.. కొండ ప్రాంతాలలోని చిన్న, ఇరుకైన రోడ్లపై ఈ కారును సునాయాసంగా నడపవచ్చు. గట్టి సస్పెన్షన్‌తో చక్కటి సౌండ్ ఇన్సులేషన్‌తో ఈ కారు మీకు మంచి రైడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ MG విండ్సర్ ప్రోను పూర్తిగా ఛార్జ్ చేస్తే.. దాదాపుగా 320 కిమీ నుంచి 350 కిమీ. డ్రైవ్‌ చేయవచ్చు. ఇక కారులోని టచ్‌స్క్రీన్‌పై ఉన్న ఆప్షన్స్‌ను కంట్రోల్ చేయడం అంత తేలికైన పని కాదు. కారులో స్విచ్‌లు లాంటివి ఎక్కువగా లేకపోవడంతో.. ప్రతీసారి టచ్ స్క్రీన్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయడం కష్టతరం అని చెప్పొచ్చు.

 

ఆటోమోటివ్ ప్రపంచంలో ఓ సంచలనం..

JSW MG మోటార్స్ ఆటోమోటివ్ ప్రపంచంలో ఓ సంచలనం అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా సరికొత్త మోడల్స్ మార్కెట్‌లోకి అందుబాటులో ఉంచుతూ.. మిగతా పోటీదారులకు గట్టి పోటీనిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ కార్ల తయారీలో అందరూ మహిళలే పాల్గోవడం గమనార్హం. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) వంటి ఆవిష్కరణలను పరిశ్రమలో మొదటిసారిగా తెచ్చింది ఈ సంస్థే. మొదట ఇది MG ZS EVతో EV మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. తర్వాత MG కామెట్‌తో మార్కెట్‌లో విప్లవాన్ని తెచ్చింది. ఇక విండ్సర్ కారు అయితే.. పోటీదారులను ఆశ్చర్యపరిచింది. ఇది టాటా మోటార్స్ పంచ్, నెక్సాన్ వంటి మోడల్స్‌కి పోటీనిచ్చింది. ఒక్క టాటా పంచ్, టాటా నెక్సాన్ మాత్రమే కాదు.. హ్యుందాయ్ క్రెటా EV, టాటా కియా వంటి కార్లకు కూడా పోటీనిస్తోంది.

ఇవి కూడా చదవండి