Mercedes-Benz: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో పలు వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. కొత్త కొత్త వాహనాలను అంబాటులోకి తీసుకువచ్చేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ (Mercedes- Benz)కూడా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. మెర్సిడెజ్ విజన్ ఈక్యూఎక్స్‌ఎక్స్ కాన్సెప్ట్ (Vision EQXX ) కారు వచ్చే ఏడాది జనవరి 3న మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఎలక్ట్రిక్ కారును సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించనుంది.
ఆటో మొబైల్ రంగంలో రారాజుగా ఉన్న టెస్లాకు ధీటుగా ఈ కంపెనీ ఈవీ కార్లను తీసుకురానుంది.
అయితే ఇందుకు సంబంధించి కంపెనీ టీజర్ కూడా విడుదల చేసింది. ఎలక్ట్రిక్ కార్లలో ఎరోడైనమిక్స్ ఫీచర్‌తో అత్యంత వేగంగా వెళ్లే కారుగా నిలుస్తుందని కంపెనీ సీవోవో మార్కస్ స్కాఫర్ తెలిపారు. ఈ కారులో బ్యాటరీ బ్యాకప్ హైలట్ అని అన్నారు. ఈ కారులో అత్యధునిక సాంకేతికను వినియోగించినట్లు చెప్పారు. 2030 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: