దేశంలోనే అత్యంత దాతృత్వం కలిగిన మహిళ.. రోజుకు రూ. 46 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆమె ఎవరో తెలుసా..?

|

Nov 03, 2023 | 3:53 PM

ఆమె రూ.170 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వడంతో ఒక వైపు మహిళా దాతలలో రోహిణి మొదటి స్థానంలో ఉండగా, మరోవైపు దేశంలోని 10మంది ధనవంతుల జాబితాలో ఆమెకు కూడా స్థానం లభించింది. రోహిణితో పాటు ఉదారంగా విరాళం ఇచ్చిన మహిళలలో అను అగా, థర్మాక్స్‌ కుటుంబం రూ.23కోట్ల, యూఎస్‌వికి చెందిన లీనా గాంధీ తివారీ రూ.23కోట్లు విరాళంగా అందించిన ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.

దేశంలోనే అత్యంత దాతృత్వం కలిగిన మహిళ.. రోజుకు రూ. 46 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆమె ఎవరో తెలుసా..?
Wife Of Nandan Nilekani
Follow us on

Hurun’s top philanthropist list for 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళం అందించిన భారతీయ మహిళ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని భార్య రోహిణి నీలేకని..ప్రపంచంలో బిల్‌ గేట్స్‌ నుండి వారెన్‌ బఫెట్‌ వరకు చాలా మంది బిలియనీర్లు విరాళాలు ఇవ్వడంలో ముందుంటారు. భారతదేశంలో కూడా దాతల కొరత లేదు. ఇక్కడ కూడా ధనవంతులు విరాళాలు ఇవ్వడంలో అందరిలోనూ ముందుంటారు. HCL శివనాడర్‌, విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ నుండి రిలయన్స్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వంటి అనేక మంది ధనవంతులు ఉన్నారు. విద్య, ఆరోగ్యంతో సహా అనేక రంగాలకు వారు తమ సంపాదనను బహిరంగంగా విరాళంగా ఇస్తుంటారు. అయితే, భారతదేశంలోనే అత్యంత దాతృత్వం ప్రదర్శించిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఆమె ఒక మహిళ..తన గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ (Hurun philanthropist list 2023) గురువారం విడుదల చేసిన లిస్ట్‌ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళం అందించిన భారతీయ మహిళ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని భార్య రోహిణి నీలేకని. తన భర్తలాగే, రోహిణి కూడా సామాజిక సేవ కోసం దాతృత్వంలో ముందంజలో ఉంటారు. ఈ సారి దేశంలోనే అత్యధిక దాతృత్వం కలిగిన మహిళగా రోహిణి గుర్తింపు సంపాదించుకున్నారు.

హురున్‌ ఇటీవలి భారతీయ మహిళ దాతల జాబితాను విడుదల చేయగా రోహిణి నీలేకని అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె రూ.170 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వడంతో ఒక వైపు మహిళా దాతలలో రోహిణి మొదటి స్థానంలో ఉండగా, మరోవైపు దేశంలోని 10మంది ధనవంతుల జాబితాలో ఆమెకు కూడా స్థానం లభించింది. రోహిణితో పాటు ఉదారంగా విరాళం ఇచ్చిన మహిళలలో అను అగా, థర్మాక్స్‌ కుటుంబం రూ.23కోట్ల, యూఎస్‌వికి చెందిన లీనా గాంధీ తివారీ రూ.23కోట్లు విరాళంగా అందించిన ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి

భర్త నందన్ నీలేకని కూడా విరాళం ఇవ్వడంలో ముందున్నారు. నందన్ నీలేకని భార్య రోహిణి నీలేకని (63) వృత్తిరీత్యా జర్నలిస్టుగా ఉంటూ ఎన్జీవోను కూడా నడుపుతున్నారు. విద్య, ఆరోగ్యం, నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులలో కూడా వారు చురుకుగా పాల్గొంటారు. ముంబైలో జన్మించిన రోహిణి నీలేకని ఇచ్చే విరాళాలలో ఎక్కువ భాగం విద్యకు సంబంధించిన పనులకే కేటాయిస్తుంటారు. రోహిణిలాగే ఆమె భర్త నందన్ నీలేకని కూడా దాతల టాప్-10 జాబితాలో ఉన్నారు. నందన్ నీలేకని గత ఆర్థిక సంవత్సరంలో రూ.189 కోట్లు విరాళంగా అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..