మెక్ డొనాల్డ్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరల్డ్ బిగ్గెస్ట్ ఫాస్ట్ ఫుడ్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజంగా కూడా మెక్ డొనాల్డ్స్ పేరు ప్రఖ్యాతులు సాధించింది. తాజాగా.. ఈ సంస్థ.. సిఈవో స్టీవ్ ఈస్టర్ బ్రూక్‌ని తొలగించింది. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్న కారణంగా ఆయనను తొలగించినట్టు మెక్‌డొనాల్డ్స్ సంస్థ తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. వ్యక్తిగత సంబంధాల కారణంగా.. కొంతమంది ప్రాణాలు తీస్తుంటే.. మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా.. ఇప్పుడు ఈ వ్యక్తిగత సంబంధాలే మెక్ డొనాల్డ్స్ సంస్థ సిఈవో.. ఈస్టర్ కొంప ముంచాయి. ఆయన సంబంధాలు.. సంస్థ విధివిధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన బోర్డ్‌ఆఫ్ డైరెక్టర్స్.. ఈస్టర్ బ్రూక్‌ని బాధ్యతల నుంచి తొలగించారు. సంస్థలో ఉన్న ఉద్యోగినితో ఆయన సన్నిహితంగా ఉంటూ.. మరికొంతమందితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా.. ఈ తప్పును ఆయనే ఒప్పుకోవడంతో.. మెక్‌డొనాల్డ్స్ బోర్డు సభ్యులు అతన్ని విధుల నుంచి తొలగించారు. దీంతో.. ఇప్పటి నుంచి ఈస్టర్‌కి.. మెక్‌డొనాల్డ్స్ సంస్థకు ఎలాంటి సంబంధాలు ఉండవని బోర్డు సభ్యులు తేల్చి చెప్పేశారు.
కాగా.. 2015 నుంచి స్టీవ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉన్నారు. స్టీవ్ నేతృత్వంలోనే మెక్ డొనాల్డ్స్ వాటాల ధర రెట్టింపు అయ్యింది. అయితే.. అప్పుడు అమ్మకాలు కాస్త తగ్గినా.. తరువాత నుంచి మంచి ఫేమ్‌తో దూసుకెళ్లింది. అయితే.. ఇప్పటి నుంచి మెక్‌డొనాల్డ్స్ సిఈవోగా క్రిస్ కెంప్ జింక్సీకి కొనసాగనున్నారు.