
ఫ్యామిలీ కార్స్ కు పెట్టింది పేరు మారుతి సుజుకీ. తక్కువ ప్రైస్ రేంజ్ లో మిడిల్ క్లాస్ కు కూడా ఎఫర్డబుల్ గా ఉండేలా కార్స్ రిలీజ్ చేస్తుంటుంది. తాజాగా ఫ్యామిలీ ఎస్ యూవీ కేటగిరీలో మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ కారు రిలీజ్ చేసింది. అదే మారుతీ సుజుకీ విక్టోరిస్. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే..
రూ. 10 లక్షల ప్రైస్ రేంజ్ లో ప్రీమియం లుక్ ఉండేలా ఈ కారు డిజైన్ చేశారు. ఈ ఎస్‌యూవీలో లేటెస్ట్ టెక్నాలజీతో పాటు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అలాగే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ, పెడిస్ట్రియన్ ప్రొటెక్షన్ సిస్టమ్, హెడ్స్ అప్ డిస్ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇక ఇంజిన్ విషయానికొస్తే.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలో ఉండే ఇంజిన్ నే దీనికీ అమర్చారు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విత్ 5 స్పీడ్ మేన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ తో వస్తుంది. అలాగే ఈ కారుకి పెట్రోల్ ట్యాంక్ తో పాటు అండర్బాడీ సీఎన్జీ ట్యాంక్ కూడా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువే. కారు మైలేజ్ వేరియంట్ ను బట్టి 20 కి.మీ నుంచి 28 కి.మీ వరకూ వస్తుంది.
కారు ఇంటీరియర్ లుక్ ప్రీమియంగా ఉంటుంది. కారు లోపల 64 యాంబియెంట్ లైట్ కలర్ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. డ్యాష్ బోర్డుపై 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో పాటు 35 ప్రీలోడెడ్ యాప్స్ తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. సుజుకీ కనెక్ట్ ద్వారా అదనంగా 60 ఫీచర్స్ పొందొచ్చు. అలగే కారు పైన డ్యుయెల్ పేన్ సన్‌రూఫ్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్, 8 స్పీకర్ సరౌండ్ సౌండ్ విత్ డాల్బీ అట్మోస్, 8వే పవర్డ్- వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి.
ఇక కారు ధరల విషయానికొస్తే.. మారుతీ సుజుకీ విక్టోరిస్ లో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ(ఓ), జెడ్ఎక్స్ఐ ప్లస్, జెడ్ఎక్స్ఐ ప్లస్(ఓ) వంటి పెట్రోల్ అండ్ హైబ్రిడ్ వేరియంట్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 10.50లక్షల నుంచి రూ. 17.77లక్షల వరకు ఉన్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ రూ. 18.64 నుంచి మొదలవుతుంది. సీఎన్జీ ఆప్షన్ ధర రూ. 11.50లక్షల మొదలవుతుంది. హైబ్రిడ్ టాప్ ఎండ్ ధర రూ. 19.99లక్షల వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ అమ్మకాలు సెప్టెంబర్ 22 నుంచి మొదలుకానున్నాయి. ఇప్పట్నుంచే ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..