AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: నిన్న కియా, నేడు మారుతీ… కార్లను రీకాల్‌ చేస్తున్న కంపెనీలు.. ఆ లోపాలే కారణం..

కార్లల్లో నెలకొన్న కొన్ని రకాల లోపాల కారణంగా కంపెనీలు వాహనాలు రీకాల్‌ చేస్తాయనే విషయం తెలిసిందే. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటాయి. మొన్నటి మొన్న కియా కంపెనీ సుమారు 70 వేలకిపైగా కార్లను రీకాల్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం...

Maruti Suzuki: నిన్న కియా, నేడు మారుతీ... కార్లను రీకాల్‌ చేస్తున్న కంపెనీలు.. ఆ లోపాలే కారణం..
Maruti Suzuki Recalls
Narender Vaitla
|

Updated on: Oct 30, 2022 | 2:34 PM

Share

కార్లల్లో నెలకొన్న కొన్ని రకాల లోపాల కారణంగా కంపెనీలు వాహనాలు రీకాల్‌ చేస్తాయనే విషయం తెలిసిందే. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటాయి. మొన్నటి మొన్న కియా కంపెనీ సుమారు 70 వేలకిపైగా కార్లను రీకాల్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కియా కార్లలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కియా ఈ నిర్ణయం తీసుకుంది. కార్లలోని లోపాలను సరిచేసేందుకు కియా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతీ కూడా కార్లను రీకాల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దేశీయ కార్ల తయారీ సంస్థ దాదాపు 9,925 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. వేగనార్‌, సెలెరియో, ఇగ్నిస్‌కు చెందిన మోడళ్లలో కొన్ని కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. వెనక బ్రేక్‌ అసెంబ్లీ పిన్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన కార్లలో లోపం ఉండే అవకాశం ఉందని మారుతీ తెలిపింది.

సదరు పిన్‌ విరిగిపోయి శబ్దం రావొచ్చని గుర్తించారు. ఇప్పటికిప్పుడు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలగకపోయినా భవిష్యత్తులో దీర్ఘకాలంలో అది బ్రేక్‌ పనితీరుపై ప్రభావం చూపుతుందని కంపెనీ తెలిపింది. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వాహనాలను పూర్తిగా చెక్‌ చేసి, లోపం ఉన్నట్లు గుర్తిస్తే సరిచేస్తామని కంపెనీలు ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం వినియోగదారులు అదనంగా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇందుకు కావాల్సిన పరికరాలను వర్క్‌షాప్‌లకు పంచించామని సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..