Maruti Suzuki: మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మారుతి సుజుకీ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. అరీనా, నెక్సా డీలర్ షిప్‌లలో మారుతి వాహనాలపై క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్‌తో పాటు కార్పొరేట్ బెన్ ఫిట్స్‌ను ఆగస్టు చివరి వరకు సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మారుతి సుజుకీ తన కంపెనీ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది.
మారుతి సుజికీ ఆల్టో 800పై ప్రస్తుత ప్రారంభ ధర రూ.2.99లక్షలు ఉండగా.. ఆ ధరపై క్యాష్ డిస్కౌంట్‌తో కలిపి రూ.43,000 వరకు తగ్గించనుంది. ఇందులో పవర్ స్టీరింగ్, రెండె ఎయిర్ బ్యాగులతో కూడిన నాలుగు సీట్ల క్యాబిన్ ఉంటుంది.
మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.78 లక్షలు ఉండగా రూ. 48,000 వరకు బెన్ఫిషియల్ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో వెనుక పార్కింగ్ సెన్సార్లు, రెండు స్పీకర్లతో కూడిన నాలుగు సీట్ల క్యాబిన్ ఉంటుంది.
మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.5.81లక్షలు ఉండగా.. ఆ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్‌ను కలుపుకొని రూ.49,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఇందులో ఐదు సీట్ల క్యాబిన్‌తో పాటు 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. రియల్ వ్యూ కెమెరాలు ఉన్నాయి.
మారుతి సుజికీ ఎస్ క్రాస్ కారు ప్రారంభ ధర రూ.8.39లక్షలు ఉండగా, ఆ కారుపై పర్చేస్ బెన్ఫిటిక్స్ కింద రూ.57,500 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఐదు సీట్ల క్యాబిన్‌తో పాటు స్టీరింగ్ వీల్, 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది.