ప్రస్తుతం కార్ అనేది సగటు మధ్యతరగతి కుటుంబానికి ఓ కల. వారి కలను సాకారం చేస్తూ మారుతీ సుజుకీ కార్లను తయారు చేస్తుంది. భారతదేశంలో మారుతీ కార్లకు ఉన్న డిమాండ్ వేరు. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను తయారు చేయడంలో మారుతీని మించింది లేదు. అలాగే సర్వీస్ విషయంలో ఆఫర్ల విషయంలో కూడా మారుతీ తన మార్క్‌ను నిరూపించుకుంటుంది. సాధారణంగా మే నెలలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని కంపెనీలు తమ కార్ల రేట్లను తగ్గిస్తాయి. పెరిగిన ఎండల నుంచి రక్షణ కోసం కార్లు కొనుగోలు చేయాలనుకునే కొంతమంది కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మారుతీ సుజుకీ మధ్య తరగతి వాళ్లను టార్గెట్ చేస్తూ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.59,000 వరకూ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉంటుంది. వ్యాగన్ ఆర్, బెలినో, స్విఫ్ట్, ఇగ్నిస్, సియాజ్, ఆల్టో కే 10, ఎస్-ప్రెసో, సెలిరియో, డిజైర్, ఈ-ఎకో వంటి కార్లపై ఈ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఆయా కార్ల ధరలను బట్టి ఆఫర్ రేట్లు ఉన్నాయి. కాబట్టి మారుతీ కంపెనీ ఏయే కార్లపై ఎంత ఆఫర్ ఇస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.
మధ్యతరగతి వారిని ఎక్కువగా ఆకట్టుకున్న ఈ కార్‌పై కంపెనీ రూ.59,000 తగ్గింపును అందిస్తుంది. అంటే ఈ కార్ ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియంట్లపై తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. రూ.40,000 తగ్గింపు ధరతో పాటు రూ.14000 ఎక్స్చేంజ్ ఆఫర్, రూ.4000 విలువైన కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈ కార్ సీఎన్‌జీ వెర్షన్‌పై రూ.39,000 తగ్గింపు లభిస్తుంది.
2022లో ఎక్కువగా అమ్ముడైన ఈ కార్‌పై రూ.54000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. రూ.30,000 ప్రత్యక్ష నగదు తగ్గింపుతో పాటు రూ.20000 వరకూ విలువైన ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది. అలాగే రూ.4000 వరకూ కార్పొరేట్ తగ్గింపులు వర్తిస్తాయి. అలాగే ఈ కార్‌లోని టాప్ స్పెక్ వెర్షన్‌పై కూడా రూ45,000 తగ్గింపు లభిస్తుంది.
ఈ కార్‌పై కూడా కంపెనీ వ్యాగన్ ఆర్ మాదిరిగానే తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తుంది. అంటే ఈ కార్‌పై కూడా రూ.54,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఎల్ఎక్స్ఐ ట్రిమ్‌పై రూ.49000 తగ్గింపు లభిస్తుంది.
టాటా పంచ్ కార్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ మారుతీ ఇగ్నీస్ కార్‌పై రూ.54,000 విలువైన ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్‌పై రూ.35,000 తక్షణ తగ్గింపు సౌకర్యంతో పాటు రూ.11,000 ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. అలాగే రూ.4000 కార్పొరేట్ తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
మారుతీ ఎస్-ప్రెస్సో కార్‌పై కూడా రూ.54,000 తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ పై రూ.30,000 తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే రూ.రూ.15,000 విలువైన ఎక్స్చేంజ్ ఆఫర్, రూ.15,000 విలువైన కార్పొరేట్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..