
మారుతి సుజుకీ కార్లకు మన దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కు అనుగుణంగానే కంపెనీ అనువైన బడ్జెట్లో అనేక మోడళ్లను లాంచ్ చేస్తుంటుంది. ఇదే క్రమంలో మారుతి సుజుకీ నుంచి అత్యంత జనాదరణ పొందిన కారు స్విఫ్ట్. దీనిని సరికొత్త ఆవిష్కరిస్తోంది కంపెనీ. న్యూ స్విఫ్ట్ హైబ్రీడ్ ఎస్‌యూవీ పేరుతో దీనిని లాంచ్ చేసేందుకు మారుతి సుజుకీ సన్నద్ధమవుతోంది. పాత మోడల్ మారుతి స్విఫ్ట్ తో పోల్చితే దీనిలో అనేక మార్పులు చేసింది. అదనపు ఫీచర్లను జోడించింది. ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ లలో కూడా భారీ మార్పులు తీసుకొచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కొత్త స్విఫ్ట్ హైబ్రీడ్ ఎస్‌యూవీ కారు ఏకంగా 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపనీ ప్రకటించింది. ఇది పాత మోడల్ కన్నా చాలా ఎక్కువ. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఫీచర్ కారు మైలేజీని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీ మైలేజ్ లీటర్ కు దాదాపు 40 కిలోమీటర్లు ఉండవచ్చని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఇంధన సామర్థ్యంలో ఈ మెరుగుదలకు వినూత్న హైబ్రిడ్ సాంకేతికత కంపెనీ వినియోగించింది.
ఈ ఎస్‌యూవీ కారు డిజైన్ చాలా కొత్తగా ఉంది. విలాసవంతమైన, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌ను అందిస్తుంది. ఆకర్షణీయమైన కలర్ కాంబినేషన్‌లో లభిస్తుంది. ఈ కారులో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ బంపర్, బ్లాక్-అవుట్ పిల్లర్, వీల్ ఆర్చ్, ఫాక్స్ ఎయిర్ వెంట్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఈ కారు ఇచ్చే అధిక మైలేజీ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది.
మారుతి సుజుకి కంపెనీ మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీని దాదాపు రూ. 10 లక్షల ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది అదే సెగ్మెంట్‌లోని ఇతర కార్ల కంటే చాలా సరసమైన ఎంపికగా చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..