Maruti Suzuki: సెప్టెంబర్ 2021 లో పండుగ సీజన్ ప్రారంభమైన వెంటనే, దేశంలో కార్ల తయారీదారులు తమ వాహనాలపై డిస్కౌంట్ ఇవ్వడం ప్రారంభించారు. మారుతి సుజుకి తన కార్లపై ఆకర్షణీయమైన డీల్స్ ప్రకటించింది. కంపెనీ అరేనా శ్రేణి కార్లపై గరిష్టంగా రూ.25,000 వరకు తగ్గింపును అందిస్తోంది.
సెప్టెంబర్ 2021 లో మారుతి అరేనా లైనప్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఆఫర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్‌లపై 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
ఆల్టో పెట్రోల్ AC వేరియంట్‌పై రూ .20,000, నాన్-ఏసీ వేరియంట్‌పై రూ .15,000 డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అయితే, ఆల్టో CNG వెర్షన్‌పై నగదు తగ్గింపు లేదు. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, చిన్న హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లపై రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది మారుతి.
S- ప్రెస్సోపై రూ. 25,000 నగదు తగ్గింపు
S-Presso పెట్రోల్ వెర్షన్ రూ. 25,000 నగదు తగ్గింపును పొందుతుంది. అయితే CNG వెర్షన్‌లో ఎలాంటి నగదు తగ్గింపు లేదు. సెలెరియో గురించి చూస్తె కనుక, ఇందులో కూడా నగదు తగ్గింపు లేదు. ఎస్-ప్రెస్సో, సెలెరియో రెండింటిపై రూ .15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ .3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.
వ్యాగన్ ఆర్ పై రూ 10,000 నగదు డిస్కౌంట్
మారుతి వ్యాగన్ ఆర్ పెట్రోల్ వెర్షన్ రూ 10,000 నగదు డిస్కౌంట్ పొందుతోంది. అయితే, CNG వెర్షన్ ఎలాంటి నగదు డిస్కౌంట్ ఉండదు. స్విఫ్ట్, డిజైర్ రెండింటిపై రూ. 10,000 నగదు తగ్గింపు ఉంటుంది.
కాగా, మారుతీ ఈ సంవత్సరంలో ఇప్పటికే మూడుసార్లు తన వాహనాల ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పండుగ డిస్కౌంట్ ఆ పెరిగిన ధరలతో సమానంగా కూడా లేకపోవడం గమనించ దగ్గ విషయం. మారుతీ ఇప్పుడు ఇస్తున్న డిస్కౌంట్స్ పరిమిత కాలానికి మాత్రమె. అదేవిధంగా ఇంతకు ముందు మారుతీ దాదాపుగా 25 వేల రూపాయలవరకూ డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చేది. కానీ, ఇప్పడు దానిని చాలా పరిమితం చేసింది.
ఇక మారుతీతో పాటుగా టాటా కూడా ఎంపిక చేసిన మోడళ్ళపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఇప్పటికే అందిస్తున్న డిస్కౌంట్లను సెప్టెంబర్ నెలకు కూడా పొడిగించింది.
గమనిక- ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్లన్నీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుండి సేకరించినవి. ఈ ఆఫర్లు డీలర్‌షిప్ నుండి డీలర్‌షిప్ వరకు మారవచ్చు.
Also Read: Personal Loan: మీకు డబ్బు ఆత్యవసరం అయితే.. పర్సనల్ లోన్ మంచి ఎంపిక ఎలా అంటే..
Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..