Maruti e Vitara: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎగుమతులు ప్రారంభం!

Maruti e Vitara: భారతదేశంలో ప్రారంభించిన అన్ని eVitara వేరియంట్లలో FWD (ఫ్రంట్-వీల్ డ్రైవ్) లేఅవుట్ ప్రామాణికంగా ఉంటుంది. డ్యూయల్-మోటార్ (AWD) వెర్షన్ ప్రస్తుతానికి అందుబాటులో ఉండదు. మారుతి సుజుకి రెండు బ్యాటరీ ఎంపికలను అందించే అవకాశం ఉంది. 49 kWh..

Maruti e Vitara: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎగుమతులు ప్రారంభం!

Updated on: Oct 26, 2025 | 12:11 PM

Maruti e Vitara: మారుతి సుజుకి, సుజుకి గ్లోబల్ నుండి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అయిన eVitara, భారతదేశం అత్యంత ఎదురుచూస్తున్న కార్ లాంచ్‌లలో ఒకటి. ఇది భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్‌ల కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ SUV.

ఇది కూడా చదవండి: New Rules: నవంబర్ 1 నుండి జరిగే కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం చూపే అంశాలు!

కారు ఎప్పుడు వస్తుంది?

మారుతి సుజుకి డిసెంబర్ 2025లో భారతదేశంలో eVitaraను విడుదల చేయనుంది. ఇది పూర్తిగా మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్‌లో తయారు అవుతుంది. ఇక్కడ మోడల్ ప్రపంచ వెర్షన్‌లు ఉత్పత్తి చేయబడి ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. అదనంగా టయోటా అర్బన్ క్రూయిజర్ EV కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది, ఇది భారతదేశంలో తయారు చేస్తోంది. భారతదేశంలో eVitara మూడు ట్రిమ్ లెవెల్స్‌లో ప్రారంభిస్తోంది. ఇది నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయిస్తుంది. అందుకే దాని ట్రిమ్ లెవెల్‌లు ఒకే నమూనాను అనుసరిస్తాయి. డెల్టా, జీటా, ఆల్ఫా. భారతదేశంలో ఇది MG ZS EV, టాటా కర్వ్ EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, కొంతవరకు మహీంద్రా BE 6 లతో పోటీపడుతుంది.

బ్యాటరీ, పనితీరు:

భారతదేశంలో ప్రారంభించిన అన్ని eVitara వేరియంట్లలో FWD (ఫ్రంట్-వీల్ డ్రైవ్) లేఅవుట్ ప్రామాణికంగా ఉంటుంది. డ్యూయల్-మోటార్ (AWD) వెర్షన్ ప్రస్తుతానికి అందుబాటులో ఉండదు. మారుతి సుజుకి రెండు బ్యాటరీ ఎంపికలను అందించే అవకాశం ఉంది. 49 kWh, 61 kWh. బ్యాటరీని బట్టి, కంపెనీ ఒకే FWD మోటారును అందిస్తుంది. ఇది 142 bhp లేదా 172 bhp పీక్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: SBI Card: ఇక రూ.1000 దాటితే బాదుడే.. ఎస్‌బీఐ కార్డ్‌ కొత్త ఛార్జీలు.. నవంబర్‌ 1 నుంచి అమలు!

ఇది కూడా చదవండి: Viral Video: రెండు కోచ్‌ల మధ్య ప్రయాణం.. ఇలాంటి డేంజర్‌ వీడియో మీరెప్పుడైనా చూశారా? దీనికి మీరేమంటారు?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి