అప్పుడు మెడికల్ సేల్స్‌మెన్లు.. ఇప్పుడు బడా వ్యాపారవేత్తలు.. కండోమ్స్ బిజినెస్‌తో కోట్లు కొల్లగొట్టారు!

మేన్‌కైండ్‌ ఫార్మా.. ఈ పేరు గురించి మీరు వినే ఉంటారు. దేశీయంగా మేన్‌ఫోర్స్ కండోమ్స్, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్‌లను విక్రయించే ఈ పాపులర్ బ్రాండ్..

అప్పుడు మెడికల్ సేల్స్‌మెన్లు.. ఇప్పుడు బడా వ్యాపారవేత్తలు.. కండోమ్స్ బిజినెస్‌తో కోట్లు కొల్లగొట్టారు!
Condoms
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 25, 2023 | 1:12 PM

మేన్‌కైండ్‌ ఫార్మా.. ఈ పేరు గురించి మీరు వినే ఉంటారు. దేశీయంగా మేన్‌ఫోర్స్ కండోమ్స్, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్‌లను విక్రయించే ఈ పాపులర్ బ్రాండ్.. ఐపీఓకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ఈ డ్రగ్ కంపెనీని ప్రారంభించింది జునేజా సోదరులు. మెడికల్ సేల్స్‌మెన్లుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వీరిద్దరూ.. పట్టు వదలని విక్రమార్కులా ఈ మేన్‌కైండ్‌ ఫార్మాను ఏకంగా రూ. 43, 264 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. రూ. 4,326 కోట్ల పబ్లిక్ ఆఫర్‌ను ఈ సంస్థ ఏప్రిల్ 25న ప్రారంభించి.. ఏప్రిల్ 27న ముగించడానికి సిద్దంగా ఉంది. ఈ ఏడాది స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టు అవుతున్న ఏడో ఐపీఓ ఇది.

రమేష్ జునేజా, రాజీవ్ జునేజా.. ఈ ఇద్దరు సోదరులు తమ ప్రయాణాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్‌‌లుగా మొదలుపెట్టారు. 1974లో రమేష్ జునేజా కీఫార్మా అనే కంపెనీలో మెడికల్ సేల్స్‌మెన్‌గా పని చేశారు. ఆ తర్వాత లుపిన్ అనే ఫార్మా కంపెనీలో ఎనిమిదేళ్లు చేసి.. 1995లో తన సోదరుడు rajeev జునేజాతో కలిసి మేన్‌కైండ్ ఫార్మాను ప్రారంభించారు. రూ. 50 లక్షల పెట్టుబడితో, 25 మంది వైద్య సిబ్బందితో అప్పట్లో ఈ సంస్థను ప్రారంభించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తమ స్కిల్స్, కార్పోరేట్ వ్యూహాలతో అంచలంచలుగా ఎదిగి రూ. 43,264 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ముఖ్యంగా వీరు 90వ దశకంలో బాలీవుడ్ స్టార్లతో చేయించిన ప్రకటనలను మధ్యతరగతి వారిని బాగా ఆకర్షించాయి.

మేన్‌కైండ్ ఐపీఓ విషయానికొస్తే.. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్‌సీలో 40,058,844 ఈక్విటీ షేర్లను జాబితా చేయాలని సంస్థ ప్రతిపాదించింది. దీనికి ప్రమోటర్లుగా రమేష్ జునేజా, రాజీ జునేజా, సీఈఓ శీతల్ అరోరా, కైర్న్‌హిల్ CIPEF, కైర్న్‌హిల్ CGPE, బీజ్ లిమిటెడ్, లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వ్యవహరిస్తారు. అలాగే ఒక్కో షేర్ ప్రైస్ రూ. 1026-1080గా నిర్ణయించారు. కాగా, మే 3న మేన్‌కైండ్ IPO షేర్ కేటాయింపును ఖరారు చేస్తుంది. అలాగే మే 4వ తేదీకి అర్హత సాధించని ఇన్వెస్టర్లకు రీఫండ్‌ డబ్బులు జమ కాగా.. మే 8న అర్హులైన పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలకు షేర్లు బదిలీ అవుతాయి.(Source)

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే