Multibagger Stock: నవంబర్ 2020 సమయంలో 0.28 రూపాయలుగా ఉన్న ఈ షేరు ధర ప్రస్తుతం రూ. 5.76 కు చేరింది. గడచిన 15 నెలల కాలంలో షేరు ధర పెరగటం వల్ల ఏకంగా 1860 శాతం లాభాన్ని అందించింది. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటంటే.. మంగళం ఇండస్టియల్ ఫైనాన్సిల్ లిమిటెడ్(mangalam industrial finance limited). ఇది కేవలం బీఎస్ఈ(BSE) స్టాక్ ఎక్ఛేంజ్ లో లిస్ట్ అయి ట్రేడ్ అవుతోంది. దీనిలో నవంబరు 2020లో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఏకంగా రూ. 5.48 లక్షలను లాభంగా అందించింది. చాలాకాలం తక్కువ రేటులోనే ట్రేడ్ అయిన ఈ షేరు ఒక్కసారిగా పుంజుకోవటం ప్రారంభించింది. షేరు విలువ క్రమంగా పెరగటానికి ప్రమోటర్లు కంపెనీలో తమ వాటాలను క్రమంగా పెంచుకోవటం కూడా ఒకటి.
గడచిన త్రైమాసికాల్లో కంపెనీ అంతకు ముందుకంటే తక్కువ లాభాలను గడించింది. ప్రస్తుతం కంపెనీ పీఈ నిష్పత్తి 40 శాతానికి మించి ఉండటం కొంత ఇబ్బందనే చెప్పుకోవాలి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నెట్ సేల్స్ రూ. 33 లక్షలుగా నమోదైంది. ఈ కంపెనీలోని మెుత్తం వాటాలో 74.54 శాతాన్ని ప్రమోటర్లు కలిగి ఉండగా.. కేవలం 25.47 శాతాన్ని పబ్లిక్ కలిగిఉంది. ఈ కంపెనీ ఫైనాన్స్ వ్యాపారంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర భారీగా పెరిగినందున చాలా మంది మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు దానిలో పెట్టుబడి పెట్టమంటుండగా.. మరికొందరు ప్రస్తుతం వద్దని అంటున్నారు. మార్కెట్ లోని చాలా మంది దాని ధర షేరుకు రూ. 10 వరకు గరిష్ఠంగా చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి..
Banking News: ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. FD వడ్డీ రేట్ల పెంపు.. సీనియర్ సిటిజన్లకు ఎంతంటే..
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 248, నిఫ్టీ 74 పాయింట్లు అప్..