Changing IFSC Code : బ్యాంక్ ఆఫ్ బరోడా , పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు తాజాగా ఓ సమాచారాన్ని వెలువరించాయి. మార్చి నుంచి కొన్ని కొత్త మార్పులు చోటుచేసుకుంటాయని ప్రకటించాయి. వినియోగదారులు గమనించి సహకరించాలని సూచించాయి.వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విజయాబ్యాంక్, డెనా బ్యాంక్ శాఖల ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారనున్నాయి. ఈ రెండు బ్యాంకులను ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు మాత్రమే పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల ఆధారంగా ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతాయి. వచ్చే నెల ఒకటో నుంచి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు అమలులోకి వస్తాయి.
విజయాబ్యాంక్ వారి ఈ-విజయ, డెనా బ్యాంక్ ఆధ్వర్యంలోని ఈ-డెనా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను డిస్‌కంటిన్యూ చేస్తున్నట్లు పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఐఎఫ్ఎస్‌సీ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ప్రతీ బ్యాంకు బ్రాంచ్‌కు వేర్వేరు కోడ్స్ ఉంటాయి. మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పనిసరి.మార్చి ఒకటో తేదీ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారుతున్నాయని తెలిపింది. విజయాబ్యాంక్, డేనా బ్యాంక్‌ల బ్రాంచ్‌ల్లో కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు తెలుసుకోవడం చాలా తేలిక అని పేర్కొంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు తమ వెబ్‌సైట్‌ను సందర్శించడం గానీ, బ్యాంక్ టెక్నికల్ సిబ్బందిని సంప్రదించడం గానీ చేయాలని సూచించింది. ఎస్ఎంఎస్ వసతిని ఉపయోగించుకోవాలని కోరింది. 18002581700 అనే హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. లేదా బ్యాంకులో రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నుంచి 8422009988 అనే ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. MIGR <SPACE> అని టైప్ చేసి ఖాతా నంబర్‌లో నాలుగు అంకెలు పేర్కొనాలి. తమ ఖాతాదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల గురించి మెయిల్స్ పంపుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌లో వీటి గురించి తెలుసుకోవచ్చు. లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖకు వెళ్లి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ తెలుసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయాబ్యాంక్, డెనా బ్యాంక్ విలీనం అయ్యాయి. దీంతో ఈ రెండు బ్యాంకుల 3898 శాఖలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. 2020 డిసెంబర్ నాటికి ఈ విలీన ప్రక్రియ పూర్తైంది. మొత్తం 5 కోట్లకు పైగా అకౌంట్లు విలీనం అయ్యాయి. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనంతో బ్యాంక్ ఆఫ్ బరోడా మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాకు 8248 దేశీయ శాఖలు, 10318 ఏటీఎంలు ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కూడా ఐఎఫ్‌ఎస్‌సికి సంబంధించిన నిబంధనలలో మార్పులు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పాత అసోసియేట్ బ్యాంకుల ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత చెక్ బుక్ మరియు ఐఎఫ్ఎస్సి లేదా ఎంఐసిఆర్ కోడ్ను మార్చబోతోంది. పాత సంకేతాలు మార్చి 31 వరకు పనిచేస్తాయని, అయితే కొత్త కోడ్‌లను పొందమని బ్యాంక్ తన వినియోగదారులకు చెప్పింది, లేకుంటే తరువాత సమస్యలు ఉండవచ్చు. మార్చి 31 వరకు కొత్త ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, చెక్‌బుక్ పొందాలని పిఎన్‌బి వినియోగదారులకు ట్వీట్ పంపింది. పిఎన్‌బి-పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకారం, పాత ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ మార్చబడింది. 31 మార్చి 2021 తరువాత, ఈ సంకేతాలు పనిచేయవు. ఎవరైనా పాత కోడ్‌ను ఉపయోగిస్తే, అప్పుడు డబ్బు బదిలీ చేయబడదు.
Dear customers, please make a note that the e-Vijaya and e-Dena IFSC Codes are going to be discontinued from 1st March 2021. It’s easy to obtain the new IFSC codes of the e- Vijaya and Dena branches. Simply follow the steps and experience convenience. pic.twitter.com/SgqrzwHf6e
— Bank of Baroda (@bankofbaroda) February 4, 2021
Motorhome Lovers : కారే విల్లా.. విల్లానే కారు.. ఆహా.. ఎంత గొప్ప సోయగం.. అంతే సదుపాయం