అయ్యో పాపం.. రూ.5 కోట్లు గెలిచి రూ.58 కోట్లు పోగొట్టుకున్నాడు

|

Jul 23, 2023 | 11:41 AM

ఆన్‌లైన్ జూదానికి బానిసైన నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి అదృష్టం ఒక్కసారిగా తలకిందులైంది. ఆన్‌లైన్ జూదానికి బానిసైన అతను ఆన్‌లైన్‌ గ్యామ్లింగ్‌లో రూ.5 కోట్ల రూపాయలు గెల్చుకున్నాడు. అత్యాశకు పోయి..

అయ్యో పాపం.. రూ.5 కోట్లు గెలిచి రూ.58 కోట్లు పోగొట్టుకున్నాడు
Online Gambling
Follow us on

ముంబై, జులై 23: ఆన్‌లైన్ జూదానికి బానిసైన నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి అదృష్టం ఒక్కసారిగా తలకిందులైంది. ఆన్‌లైన్ జూదానికి బానిసైన అతను ఆన్‌లైన్‌ గ్యామ్లింగ్‌లో రూ.5 కోట్ల రూపాయలు గెల్చుకున్నాడు. అత్యాశకు పోయి మళ్లీమళ్లీ ఆడి ఏకంగా రూ.58 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్ మోసగాడి ఉచ్చులో చిక్కుకున్న ఈ వ్యాపారి ఉన్న డబ్బంత పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారికి అనంత్ అలియాస్ నవరతన్ జైన్ అనే అన్‌లైన్ బుకీతో పరిచయమైంది. వాట్సాప్ లింకుల ద్వారా జైన్ గ్యాబ్లింగ్ నడిపించేవాడు. వ్యాపారి మొదట రూ. 8 లక్షలు డిపాజిట్ చేసి చిన్నచిన్న మొత్తాల్లో పందెం కాశాడు. వేలు పెడితే లక్షలు, లక్ష పెడితే రూ.8 లక్షలు వచ్చాయి. ఇలా జూదంలో మొత్తం రూ. 5 కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత అత్యాశతో అతను పందెం కాసేకొద్దీ ఓడిపోవడం ప్రారంభించాడు. ఇలా మొత్తం రూ. 58 కోట్లు పోగొట్టుకున్నాడు. తన డబ్బు తిరిగి ఇవ్వమని జైన్‌ కోరగా అతను నిరాకరించాడు.

దీంతో తాను మోసపోయిన సంగతి తెలుసుకున్న వ్యాపారి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జైన్ వివరాలు ఆరా తీసి అతని ఇంటిపై పోలీసులు గోండియాలోని అతని నివాసంపై ఆకస్మిక దాడి చేశారు. ఐతే నిందితుడు అప్పటికే పరారయ్యాడు. జైన్ ఇంట్లో రూ.14 కోట్ల నగదు, 4 కేజీల బంగారు బిస్కెట్లతోపాటు ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జైన్ ముంబై నుంచి దుబాయ్‌కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.