LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఈ రోజు నుంచి అమలు

|

Sep 01, 2021 | 10:42 AM

Cylinder Price Hyderabad: గ్యాస్ సిలిండర్ వాడే వారికి షాక్‌ ఇచ్చింది ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. తాజాగా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచింది. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌పై..

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఈ రోజు నుంచి అమలు
Follow us on

Cylinder Price Hyderabad: గ్యాస్ సిలిండర్ వాడే వారికి షాక్‌ ఇచ్చింది ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. తాజాగా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచింది. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌పై 25 రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కమర్షియల్‌ సిలిండర్‌పై 75 రూపాయల వరకు పెంచింది. పెరిగిన ఈ ధరలు ఈ రోజు (బుధవారం) నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి. తాజా ధరల ప్రకారం.. ఇక 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.912 ఉండగా, ఇక ఢిల్లీలో ధర రూ.884, అలాగే కోల్‌కతాలో రూ.886.50, ముంబైలో రూ.859.50, చెన్నైలో రూ.-875.50 ఉంది

ధరలు పెరగడంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండో సారి కావడం గమనార్హం.

ఈ ఏడాది ఆరంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండేది. ఇప్పుడు రూ.884కు చేరింది. గత ఏడేళ్ల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు కావడం సామాన్య జనాలకు షాకిచ్చినట్లవుతుంది. 2014 మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.410 వద్ద ఉండేది. అదేసమయంలో ఈరోజు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.75 పైకి కదిలింది.

ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సిలిండర్ బుకింగ్,  డెలివరీ బాయ్ తీసుకునే  చార్జీ కలుపుకొంటే దాదాపుగా రూ.1000 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.1000 పెడితే కానీ గ్యాస్ సిలిండర్ లభించని పరిస్థితి నెలకొంది. ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడంతో సామాన్యులకు భారీగా మారిపోతోంది.

ఇవీ కూడా చదవండి:

Jio New Prepaid Plans: రిలయన్స్‌ జియో కొత్త ప్లాన్స్‌.. ఏకంగా సంవత్సరం పాటు హాట్‌స్టార్ ఉచితం..!

Petrol Diesel Price: గుడ్‌న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎంత తగ్గిందంటే..

September 1: కస్టమర్లు అలర్ట్‌: నేటి నుంచి ఈ నిబంధనలు మారుతున్నాయ్‌.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలివే..