LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. సిలిండర్ రేటును భారీగా తగ్గించేందుకు కేంద్రం కొత్త ఫార్ములా..

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అతి తర్వలో గుడ్ న్యూస్ రాబోతోంది. చౌకగా గ్యాస్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది.

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. సిలిండర్ రేటును భారీగా తగ్గించేందుకు కేంద్రం కొత్త ఫార్ములా..
Lpg Gas

Updated on: Nov 29, 2022 | 12:43 PM

వినియోగదారులకు శుభవార్త. ఎల్​పీజీ సిలిండర్ ధరలు తగ్గే అవకాశముంది. దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధరపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు. గ్యాస్‌ను చౌకగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ప్లాన్ LPG, CNG గ్యాస్ రెండింటి ధరలను తగ్గించే అవకాశం ఉంది. గత కొంత కాలంగా గ్యాస్ ధర పెరగడంతో ప్రజలపై భారం పెరుగుతోంది. గ్యాస్ ధర పరిమితిని నిర్ణయించే అవకాశం ఉంది. గ్యాస్ ధరల నియంత్రణకు కమిటీ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కింద ప్రభుత్వ రంగ సంస్థల పాత సెక్టార్ నుంచి వచ్చే సహజ వాయువు ధర పరిమితిని నిర్ణయించాలని ప్లాన్ చేస్తోంది. ఇది గ్యాస్ కోసం సిఫార్సు చేయబడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం CNG, PNG రెండింటి ధరలను తగ్గిస్తుంది. దీని వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్ ఎస్ పరేఖ్ నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. దానిని ఖరారు చేసే పనిలో ఉంది. ఈ కమిటీ తన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కొత్త ఫార్ములా రూపొందించబడుతుంది

కష్టతరమైన ప్రాంతాలకు వివిధ సూత్రాలు కూడా సూచించబడవచ్చు. ప్రాంతాల వారీగా వివిధ ఫార్ములాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న అధిక చెల్లింపు రేటు ఫార్ములాను అలాగే కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం