LPG Cylinder: దీపావళికి ముందు మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఆ ప్రభుత్వం కీలక ప్రకటన

|

Oct 07, 2024 | 1:01 PM

ఈ రోజుల్లో గ్యాస్‌ సిలిండర్‌ ప్రతి ఇంట్లో ఉంటుంది. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. పొగ వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందరికి గ్యాస్‌ సిలిండర్‌ ఉండాలని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీంతో మహిళల పేరుపై చాలా మందికి..

LPG Cylinder: దీపావళికి ముందు మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఆ ప్రభుత్వం కీలక ప్రకటన
Follow us on

ఈ రోజుల్లో గ్యాస్‌ సిలిండర్‌ ప్రతి ఇంట్లో ఉంటుంది. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. పొగ వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందరికి గ్యాస్‌ సిలిండర్‌ ఉండాలని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీంతో మహిళల పేరుపై చాలా మందికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ అందించింది మోడీ సర్కార్‌. ఇక దీపావళికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు పెద్ద బహుమతిని ఇవ్వబోతోంది. ఈ దీపావళి రోజున ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులందరికీ ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్లు అందజేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన తన పోస్ట్ ద్వారా ప్రకటించారు. దీంతో పాటు దీపావళికి ముందే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి. దీంతో లబ్దిదారులు ఈ ఉచిత సిలిండర్‌ ప్రయోజనం పొందనున్నారు.

ఇది కూడా చదవండి: Street Food: ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి నెల ఆదాయం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే.. సోషల్‌ మీడియాలో వైరల్‌

ఇవి కూడా చదవండి

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. దీపావళి సందర్భంగా ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులందరికీ ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేయాలని సీఎం యోగి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అంటే ఏమిటి?

దేశంలోని ప్రతి గ్రామంలో మహిళలు గ్యాస్ సిలిండర్‌పైనే వంట చేసుకునే విధంగా ప్రభుత్వం ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. తద్వారా మహిళలు సులభంగా గ్యాస్‌తో ఆహారాన్ని వండుకోవచ్చు. ఈ పథకం వచ్చిన తర్వాత ప్రతి మహిళ కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా గ్యాస్‌ సిలిండర్‌ ద్వారా వంట చేసుకుంటున్నారు. కట్టెల పొయ్యితో వంట చేయడం ద్వారా పొగ వల్ల చాలా మంది స్త్రీలకు అనేక రకాల కంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: BSNL New Feature: బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో ముందడుగు.. స్పామ్‌ కాల్స్‌ను అరికట్టేందుకు కొత్త ఫీచర్‌.. ఫిర్యాదు చేయండిలా!

ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు?

ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు గ్యాస్ కనెక్షన్‌తో పాటు ఉచితంగా సిలిండర్‌ను అందజేస్తున్నారు. దీనితో పాటు, సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా లభిస్తుంది.

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి