
దేశంలో యువత ఆలోచన మారుతోంది. 9 టూ 5 జాబ్ బోర్‌గా ఫీలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏదైనా ఛాలెంజింగ్‌గా ఉండాలని ఆశిస్తున్నారు. కెరీర్‌ను కూడా ఛాలెంచింగ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మరీ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే బిజినెస్ అనగానే చాలా మంది ఎక్కడ నష్టం వస్తుందోనన్న అనుమానంతో వెనకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్లాన్ చేసుకుంటే లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచాన్ని భయపెడుతోన్న వాటిలో ప్లాస్టిక్ ప్రధానమైంది. రోజురోజుకీ పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతం పర్యావరణంతో పాటు మనిషి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. దీంతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే పేపర్ గ్లాసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అవసరాన్ని మంచి వ్యాపారంగా మార్చుకోవచ్చు. ఇంతకీ పేపర్ కప్ తయారీ యూనిట్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి.? ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది.? ఎంత ఆదాయం పొందొచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం..
పేపర్ కప్ తయారీ యూనిట్‌ను తక్కువ బడ్జెట్‌తో ప్రారంభించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. పేపర్ కప్స్ తయారీకి స్మాల్ స్కేల్ సైజ్ మిషిన్స్ అవసరపడతాయి. వీటి ధర రూ. 1 లక్ష నుంచి అందుబాటులో ఉంటాయి. ఎక్కువ కప్స్‌ను తయారు చేసే పెద్ద మిషన్ అయితే రూ. 10.70 లక్షల వరకు ఉంటుంది. వీటితో పాటు పేపర్ కప్ తయారీ యూనిట్‌కు కొంత ఖాళీ స్థలం, విద్యుత్ సదుపాయం ఉండాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ముద్ర లోన్స్ ద్వారా మన పెట్టుబడిలో 75 శాతం తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. మిగతా 25 శాతం మనం సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే చిన్న మిషిన్లతో ప్రారంభించడం బెటర్‌గా చెప్పొచ్చు. ఇక పేపర్ కప్స్ తయారీకి రా మెటిరీయల్ అవసరపడుతుంది. పేపర్ రీల్స్‌తో పాటు బాటమ్ రీల్స్ అవసరపడుతాయి. పేపర్ రీల్స్ కిలో ధర రూ.10, బాటమ్ రీల్స్ కిలోకు రూ. 80 వరకు పలుకుతోంది. ఇక ప్రతీ ఏటా సరాసరి 2 కోట్లకుపైగా పేపర్ కప్‌లను తయారు చేయొచ్చు. ఒక్క పేపర్ కప్ 30 పైసలు అనుకున్న ఏడాదికి ఎంత ఆదాయం ఆర్జించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..