దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది ఇండియన్ రైల్వేనే. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల కోసం భారత రైల్వే శాఖ ఎన్నో చర్యలు చేపడుతుంటుంది. టికెట్ ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యుడు సైతం రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారు. చాలా మంది రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే రిజర్వేషన్ చేసుకున్నా జారీ చేసిన టికెట్ పోయినట్లయితే ఇబ్బందులు పడుతుంటారు. టికెట్ లేకపోతే టీసీ నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఒక వేళ అలాంటి సందర్భం మీకు ఎదురైనట్లయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక వేళ టికెట్ చిరిగిపోయినా ఇండియన్ రైల్వే అందుకు ప్రత్యామ్నాయ సదుపాయాన్ని కల్పిస్తుంది.
రైల్వే టికెట్ పోయినప్పుడు ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా డూప్లికేట్ టికెట్‌ణు పొందే విధంగా వెసులుబాటు కల్పిస్తోంది రైల్వే శాఖ. ఇందు కోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ పోగొట్టుకున్న విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అక్కడ రైలు ఛార్ట్ రెడీ కాకముందు, ఛార్ట్ రెడీ అయిన తర్వాత వేర్వేరు ఛార్జీలు ఉంటాయని గుర్తించుకోవాలి. టికెట్ కన్ఫర్మ్ అయి ఛార్ట్ రెడీ కాకముందు రైల్వే అధికారులను సంప్రదిస్తే డూప్లికేట్ టికెట్‌ను జారీ చేస్తారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి క్లరికేజ్ ఛార్జీలను వసూలు చేస్తారు.
ఆర్‌ఏసీ టికెట్లు ఉన్నవారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఒక వేళ ఛార్ట్ రెడీ అయిన తర్వాత టికెట్ పోయినట్లయితే డూప్లికేట్ టికెట్ పొందేందుకు 50 శాతం ఫీజు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్‌ఏసీ టికెట్ కలిగిన వారికి ఈ సదుపాయం లేదు.
అలాగే ఛార్ట్ రెడీ అయ్యాక టికెట్ చిరిగిపోయినట్లయితే దాని స్థానంలో డూప్లికేట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం టికెట్‌లో 25 శాతం ఫీజుగా చెల్లించి తీసుకోవచ్చు.ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక టికెట్ చిరిగిన టికెట్ స్థానంలో డూప్లికేట్ టికెట్ కోసం ఆర్‌ఏసీ టికెట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొత్తం ఫేర్‌లో 25 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒరిజినల్ టికెట్ దొరికితే ప్రయాణం కంటే ముందే రైల్వే అధికారులకు సమర్పించినట్లయితే అప్పుడు 5 శాతం ఛార్జ్ మినహాయించుకుని మిగతా అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే.. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోకి వెళ్లి టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి