
ఈ మధ్యకాలంలో లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోన్ ఈఎంఐ చెల్లించడంలో కాస్త ఆలస్యం అయినా కూడా ఇంటికి ఓ నాలుగురు వచ్చేసి నానా హంగామా చేస్తున్నారు. డబ్బులు ఇస్తావా? చస్తావా అనే రీతిలో లోన్ తీసుకున్న వారిని దారుణంగా హింసిస్తున్నారు. అధిక వడ్డీలతో ప్రజలను పీక్కుతినడమే కాకుండా రికవరీ కోసం వారి ప్రాణాలు పోయిన పర్లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది.
రుణం విషయంలో బ్యాంకు రికవరీ ఏజెంట్లతో జరిగిన ఘర్షణలో 28 ఏళ్ల వ్యక్తి తనను తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రుణం విషయంలో జరిగిన వివాదం తర్వాత బ్యాంకు రికవరీ ఏజెంట్లతో జరిగిన ఘర్షణలో 28 ఏళ్ల వ్యక్తి తనను తాను నిప్పంటించుకున్నాడు. బాధితుడిని అద్నాన్ ఉస్మాన్ షేక్ గా గుర్తించారు. యువకుడిని సియోన్ ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతను అక్కడ చికిత్స పొందుతున్నాడని ముంబై పోలీసులు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి