ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ప్రతి రోజు బ్యాంకు లావాదేవీలు జరిపే వారు ముందస్తుగా అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో ముందస్తుగా తెలుసుకోవడం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక డిసెంబర్ నెలలో బ్యాంకులు 13 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని పెండింగ్‌లో ఉంటే, బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేయండి. అయితే బ్యాంకుల పని ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చేసే పని సులభంగా చేయవచ్చు. 4 ఆదివారాలు కాకుండా, డిసెంబర్‌లో వచ్చే సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంటుంది.
కొన్ని బ్యాంకు సెలవులు జాతీయమైనవి. ఆ రోజున దేశం మొత్తం బ్యాంకుల్లో సెలవు ఉంటుంది. ఇది కాకుండా, రాష్ట్రాల పండుగల ఆధారంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. జాతీయ స్థాయిలో డిసెంబర్‌లో 3,4,10,11,18,24,25 తేదీల్లో బ్యాంకులు ఏకకాలంలో మూసి ఉంటాయి. డిసెంబర్ 24న, క్రిస్మస్, నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి