LIC Saral Pension: పదవీ విరమణ తర్వాత మీ సంపాదన ఏమవుతుందో అని మీరు ఆందోళన చెందుతుంటే.. మీరు దీని కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో మీరు ప్రతి నెలా రూ.12,000 పెన్షన్ పొందుతారు.
ఇలా చేస్తే ప్రతి నెలా రూ.12,000 పెన్షన్ వస్తుంది
మీరు ఇటీవల పదవీ విరమణ చేసినట్లయితే, మీరు పదవీ విరమణ సమయంలో పొందిన PF ఫండ్, గ్రాట్యుటీ నుండి పొందిన డబ్బు నుండి ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్‌లో ఒక వ్యక్తి ఏక మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా 42 సంవత్సరాల వయస్సులో రూ. 30 లక్షల యాన్యుటీని కొన్నారని అనుకుందాం.. అప్పుడు అతను నెలకు దాదాపు రూ. 12,388 సంపాదించవచ్చు. ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. ఎల్ఐసీ ర్యాలయాన్ని సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ప్లాన్ ఫీచర్స్
1. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలో ఒకరు ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలి.
2. ఒక్కసారి అందులో డబ్బు పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు.
3. నిబంధనల ప్రకారం పాలసీదారు మరణించిన తర్వాత పాలసీలోని డబ్బు అతని/ఆమె నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది.
4. 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఈ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు.
5. మీరు ఈ పథకంలో వ్యక్తిగతంగా లేదా మీ జీవిత భాగస్వామితో కలిసి పెట్టుబడి పెట్టవచ్చు.
6. LICలో ఈ పాలసీని ప్రారంభించిన తేదీ నుండి ఆరు నెలల వ్యవధి తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు.
7. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.12,000 యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు.
8. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.
9. ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత వార్షిక, అర్ధ సంవత్సరం, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు.
10. ఈ పాలసీలో మీకు రుణ సౌకర్యం కూడా లభిస్తుంది.
11. ఆరు నెలల తర్వాత ఈ పాలసీలో రుణం తీసుకోవచ్చు.
12. LICలో ఈ ప్లాన్‌లో మీరు పొందుతున్న పెన్షన్ మొత్తం అదే మొత్తం జీవితాంతం పొందడం కొనసాగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి