LIC IPO: నేడే ఎల్‌ఐసీ షేర్ల కేటాయింపు.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) కోసం బిడ్డింగ్ వేసిన వారికి నేడు షేర్లు కేటాయించనున్నారు. ..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) కోసం బిడ్డింగ్ వేసిన వారికి నేడు షేర్లు కేటాయించనున్నారు. పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకున్న వారు BSE వెబ్‌సైట్ లేదా దాని రిజిస్ట్రార్ కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో LIC IPO కేటాయింపు స్థితిని తెలుసుకోవచ్చు. షేర్ కేటాయింపు ప్రకటన తర్వాత మాత్రమే LIC IPO కేటాయింపు స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. LIC IPO మే 4న ఓపెన్ అయి 9న ముగిసింది. ఈ ఐపీఓ దాదాపు 3 సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. నేడు షేర్ల కేటాయింపు జరగగా.. మే 17న ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానుంది. LIC IPOలో పెట్టుబడి పెట్టినవారు అధిక లిస్టింగ్ లాభాలను పొందే అవకాశం తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గ్రే మార్కెట్ సూచనలు పెట్టుబడిదారుల ఆందోళనను పెంచుతుంది. నిజానికి ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లు పాల్గొనకపోవడం వల్ల గ్రే మార్కెట్ ప్రీమియం ప్రతికూలంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
షేర్ల కేటాయంపు ఇలా చెక్ చేసుకోండి.. LIC IPO షేర్ కేటాయింపు ప్రకటన తర్వాత, బిడ్డర్లు ఇంట్లో కూర్చొని కేటాయింపు స్థితిని సులభంగా తనిఖీ చేయవచ్చు. వారు BSE అధికారిక వెబ్‌సైట్ – bseindia.com లేదా కెఫిన్ టెక్ వెబ్‌సైట్ – karisma.kfintech.comకి లాగిన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో LIC IPO కేటాయింపు స్థితిని తనిఖీ చేయవచ్చు.
BS0E వెబ్‌సైట్‌లో ఎలా తనిఖీ చేయాలి 1.మీరు BSE లింక్‌కి లాగిన్ చేసి, కొన్ని దశలను అనుసరించడం ద్వారా కేటాయింపు స్థితిని తనిఖీ చేయవచ్చు.
2.BSE లింక్ bseindia.com/investors/appli_check.aspxకి లాగిన్ చేయండి. LIC IPOని ఎంచుకోండి. మీ LIC IPO అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయండి. మీ పాన్ వివరాలను నమోదు చేయండి. సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
Read Also.. Axis Bank: పొదువు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..