LIC IPO Alert: ఉక్రెయిన్‌పై రష్యా(Russia Ukraine war) దాడి చేయడంతో మార్కెట్లో ఒడిదొడుకులు ఏర్పడ్డాయి. దీని కారణంగా భారత స్టాక్ మార్కెట్లు(Indian Stock Market) గతంలో ఎన్నడూ లేని విధంగా ఒలటైల్ గా మారాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకురావాలనుకున్న మెగా ఐపీవోను వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఐపీవోను పోస్ట్ పోన్ చేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, ఇతర అధికారులు చర్యలు చేపడుతున్నారు. మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ ముందుకు ఈ ఐపీవోను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించపోకపోయినా.. దీనికి సంబంధించిన వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. నెలాకరులోపు దీనిపై ఒక కీలక ప్రకటన రావచ్చని వారు తెలిపారు.
యాంకర్ పెట్టుబడిదారులతో LIC అండర్ రైటర్లు నిర్వహించిన సమావేశంలో పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. పెట్టుబడి పెట్టే విషయంలో చాలా మ్యుచువల్ ఫండ్లకు సంబంధించిన మ్యానేజర్లు స్పష్టమైన హామీని ఇవ్వలేదని తెలుస్తోంది. యుద్ధం వల్ల మార్కెట్లో వచ్చిన మార్పులకు ఎల్ఐసీ ఐపీవో భారీగా ప్రభావితం కానుంది. ఈ ఐపీవో నుంచి భారీగా సొమ్మును మదుపరుల నుంచి మెుబిలైజ్ చేయాలని అనుకుంటున్నందున.. దానిని బడ్జెట్ లోని డెఫిసిట్ కు వినియోగించాలని ప్లాన్ చేయటంతో ప్రభుత్వం దీనిపై ఆచితూచి ముందుకు వెళ్లవచ్చని తెలుస్తోంది. ఐపీవో విషయంలో మరో సారి ఆలోచించే ఉద్ధేశం ఉన్నట్లు ఆర్థిక మంత్రి ఈ వారం చెప్పినందున.. ఈ ఆర్థిక సంవత్సరం కాకపోయినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని పూర్తిచేయవచ్చని తెలుస్తోంది. ఈ మార్పు ప్రభుత్వం పై పెద్ద భారాన్ని తీసుకొచ్చే ప్రమాదమూ ఉంది. తరువాత అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ ఆస్తుల పైనా ఈ ప్రభావం ఉండనుంది. LIC అరంగేట్రం దేశం యొక్క మూలధన మార్కెట్ల లోతును, ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడి పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న వారి ఆసక్తిని మనం దీని ద్వారా గమనించవచ్చు. లేటు కారణంగా వచ్చే సంవత్సరం కేంద్రం ఓపెన్ మార్కెట్ బారోయింగ్ కు వెళ్లటానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
EV Charging Station: అక్కడ 121 కార్లకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టొచ్చు..! దాని స్పెషాలిటీలు మీ కోసం..
Insurance Alert: ఇన్సూరెన్స్ కొనేటప్పుడు రైడర్ కూడా తీసుకోవాలా.. రైడర్ వల్ల ఉపయోగం ఏమిటి..